EPAPER
Kirrak Couples Episode 1

Amazon Great Indian Festival sale 2024: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐక్యూ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు, వదిలారో మళ్లీ రావు!

Amazon Great Indian Festival sale 2024: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐక్యూ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు, వదిలారో మళ్లీ రావు!

Amazon Great Indian Festival sale 2024: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సేల్‌లో పలు ప్రొడక్టులపై ఆఫర్లు పొందేందుకు తహతహలాడుతున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 26న ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 27న ఈ సేల్ మిగతా వారికి అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వివో, శాంసంగ్, పోకో, రెడ్‌మి, రియల్‌మి, షావోమితో సహా ఇతర ఫోన్లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి.


ఇప్పుడు అమెజాన్ మరో కంపెనీ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో iQOO స్మార్ట్‌ఫోన్‌లను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వీటిలో iQOO Z9x 5G, Z9 Lite 5G, Z9s Pro 5G, Neo 9 Pro, iQOO 12 5G వంటి ఫోన్లు ఉన్నాయి. అయితే ఒక్క తగ్గింపు ఆఫర్లు మాత్రమే కాకుండా ఈ సేల్‌లో కస్టమర్‌లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోళ్లు చేస్తే దాదాపు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

Also Read:  అబ్బబ్బ ఏం ఫోన్‌ రా మావా.. ఫస్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు, ఫీచర్లు పిచ్చెక్కించాయ్!


అయితే ఇవి మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్నింటిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇక iQOO Z9 Lite, iQOO Z9 5G, iQOO Z7 Pro కోసం ప్రారంభ డీల్స్ Amazonలో లిస్టింగ్ చేయబడ్డాయి. అందులో iQOO Z9 Lite బేస్ 4 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,499 ధరతో అందుబాటులో ఉంది. అయితే దీనిని అమెజాన్ సేల్‌లో రూ.9,499కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా iQOO Z9x బేస్ 4 GB + 128 GB వేరియంట్‌ను అసలు ధర రూ.12,999 ఉండగా ఈ సేల్‌లో రూ.10,749 లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ సేల్‌లో iQOO Z9s 5G, Z9s Pro 5Gలను నో-కాస్ట్ EMIతో తీసుకురానున్నారు.

దీనితో పాటు iQOO Z9s ఫోన్ 8GB + 128 GB వేరియంట్‌ రూ.19,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు రూ.17,499లకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో iQOO Z9s ప్రో 8 GB + 128 GB వేరియంట్‌ను రూ. 3,000 తగ్గింపుతో రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు. కాగా iQoo తాజాగా చైనాలో Z9 Turbo+ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌గా అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6400 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లే, సెంటర్‌లో పంచ్ హోల్డ్ కటౌట్‌ను కలిగి ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఓపెన్ వరల్డ్ మొబైల్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు గరిష్టంగా 72 fps (సెకనుకు ఫ్రేమ్‌లు) పొందుతుంది. ఇది 6400 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Vivo V40e Launched: వివో టైం ఆగయా.. కిర్రాక్ ఫీచర్లతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయిందంతే!

Samsung Galaxy A16 5G: పవర్ ఫుల్ ప్రాసెసర్, 6 ఏళ్ల OS అప్డేట్‌తో శాంసంగ్ గెలాక్సీ A16 5G.. త్వరలోనే ఇండియా లాంచ్

Motorola Edge 50 Neo: అబ్బబ్బ ఏం ఫోన్‌ రా మావా.. ఫస్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు, ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

iQoo Z9 Turbo+ 5G: ఇచ్చిపడేసిన ఐక్యూ.. పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్, ధర ఎంతంటే?

Redmi K80: రెడ్‌మి హవా.. కె80 సిరీస్‌లో మరో రెండు ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?

Tecno Pop 9 5G: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!

Big Stories

×