EPAPER
Kirrak Couples Episode 1

Samsung Galaxy A16 5G: పవర్ ఫుల్ ప్రాసెసర్, 6 ఏళ్ల OS అప్డేట్‌తో శాంసంగ్ గెలాక్సీ A16 5G.. త్వరలోనే ఇండియా లాంచ్

Samsung Galaxy A16 5G: పవర్ ఫుల్ ప్రాసెసర్, 6 ఏళ్ల OS అప్డేట్‌తో శాంసంగ్ గెలాక్సీ A16 5G.. త్వరలోనే ఇండియా లాంచ్

Samsung Galaxy A16 5G| స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో టాప్ కంపెనీల అయిన శాంసంగ్ త్వరలోనే ‘A’ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో సెప్టెంబర్ నెల చివరిలోగా ఇండియాలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన వివరాలను శాంసంగ్ కంపెనీ అధికారిక వెబసైట్ సపోర్ట్ పేజీలో లైవ్ లో కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టెకె నిపుణలు తెలిపిన వివరాల ప్రకారం.. Samsung Galaxy A16 5G లో 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్ లభిస్తాయి. ఇంతకుముందు Samsung Galaxy S24 series లో లభించే ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్ కంటే ఇది ఎక్కువ.


Samsung Galaxy A16 5G గురించి మరిన్ని వివరాలు
Samsung Galaxy A16 5G మోడల్ త్వరలోనే ఇండియాలో లాంచ్ కానుంది. దీని మోడల్ నెంబర్ SM-A166P/DS గా శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో ఉంది. ఈ మోడల్ నెంబర్ లోని DS అంటే డుయల్ సిమ్ సపోర్ట్ అని అర్థం. శాంసంగ్ కొత్త ఎ సిరీస్ మోడల్ థాయ్ ల్యాండ్ లోనూ లాంచ్ కానున్నుట్లు తెలిసింది. ఇదే మోడల్ నెంబర్ (SM-A166P/DS)తో థాయ్ ల్యాండ్ NBTC సర్టిఫికేషన్ కూడా లిస్ట్ చేసింది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ సపోర్ట్ పేజీలోని లైవ్ ఇండియా సెక్షన్ లో Galaxy A16 5G ఈ నెలలోనే ఇండియాలో లాంచ్ కానున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.

Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్


Galaxy A16 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A16 5G లో ఫీచర్లు, డిజైన్ గురించి కొన్ని రిపోర్ట్స్ లీక్ అయ్యాయి. శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెఫ్ రేట్, 800 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్ తో 6.7-inch FHD+ Super AMOLED Infinity U డిస్ ప్లే ఉంటుంది. ఈ కొత్త మోడల్.. Exynos 1330 మరియు MediaTek డైమెన్సిటీ 6300 చిప్ సెట్స్ ప్రాసెసర్, 4860mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఎ సిరీస్ లో వచ్చే ఈ కొత్త మోడల్.. యూజర్లకు నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB, and 8GB + 256GB. ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా ఇది పనిచేస్తుంది.

వీటితోపాటు Galaxy A16 5G డస్ట్, వాటర్ రెసిస్టెనస్ ఉండడంతో దీనికి IP54 రేటింగ్ లభించింది. ఇందులో యుఎస్‌బి టైప్ సి పోర్ట్ కూడా ఉంది. ఇప్పటివరకు కంపెనీ ఏ విధమైన టీజర్ విడుదల చేయడం, లేదా అధికారికంగా ప్రకటించడం చేయలేదు. అయితే లీకైన రిపోర్ట్ నిజమైతే అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. ఈ ‘ఎ’ సిరీస్ కొత్త మోడల్ కలర్ వేరియంట్స్.. లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్, గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. దీనికి ఫ్లాట్ ఎడ్జి, నాచ్‌డ్ డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఉంటాయి.

Related News

Vivo V40e Launched: వివో టైం ఆగయా.. కిర్రాక్ ఫీచర్లతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయిందంతే!

Amazon Great Indian Festival sale 2024: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐక్యూ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు, వదిలారో మళ్లీ రావు!

Motorola Edge 50 Neo: అబ్బబ్బ ఏం ఫోన్‌ రా మావా.. ఫస్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు, ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

iQoo Z9 Turbo+ 5G: ఇచ్చిపడేసిన ఐక్యూ.. పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్, ధర ఎంతంటే?

Redmi K80: రెడ్‌మి హవా.. కె80 సిరీస్‌లో మరో రెండు ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?

Tecno Pop 9 5G: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!

Big Stories

×