EPAPER
Kirrak Couples Episode 1

R Krishnaiah: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

R Krishnaiah: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

R Krishnaiah: ఆర్ కృష్ణయ్య రూటు ఎటు? మళ్లీ రాజకీయాల్లోకి యాక్టివ్ అవుతారా? లేక బీసీ కుల‌గణనపై ఉద్యమం చేస్తారా? ఎంపీ పదవికి ఆయనెందుకు రాజీనామా చేశారు? మోదీ సర్కార్ ఏమైనా ఆఫర్ ఇచ్చిందా? రాజకీయ నేతలు ఎందుకు ఆయనతో భేటీ అవుతున్నారు? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి.


బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఆయన.. ఆశ, శ్వాసంతా బీసీలకు న్యాయం చేయాలన్నదే కాన్సెప్ట్. ఈ క్రమంలో పదవులను సైతం వదిలిన నేత. అఫ్‌కోర్స్ తెర వెనుక కారణాలు అనేకం ఉండొచ్చు. నాలుగేళ్లు ఉండగానే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారాయన. ఛైర్మన్ దానికి ఆమోదం తెలిపారు కూడా. ప్రస్తుతం ఆయన రూటు ఎటున్నదే రాజకీయాల్లో వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఆర్ కృష్ణయ్య రాజీనామా అనంతరం బీజేపీ నేతలు ఆయనతో సమావేశమయ్యారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలీదు.. అంతా సస్పెన్స్. కాకపోతే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ వార్త హంగామా చేస్తోంది. మోదీ సర్కార్  ఆర్ కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


అంతకుముందు బీజేపీ కీలక నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆయనకు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే తెలంగాణలో ఓటు బ్యాంకు మరింత పెరుగుతుందని కమల నాధులు భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు స్వయంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

తాజాగా మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. కృష్ణయ్య నివాసానికి వెళ్లి మరీ కలిశారాయన. ఇరువురు నేతల మధ్య అరగంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

బీసీ, కులగణన, రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా ప్రస్తావించారట. కాంగ్రెస్ కూడా కుల‌గణన చేపట్టాలని మోదీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని రెండురోజుల కిందట జరిగిన పలు బీసీ సంఘాలు ఆయనను కోరారు. మరి కొత్త పార్టీ పెడతారా? బీసీ కుల గణన చేయాలని పోరాటం చేస్తారా? జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి వైపు మొగ్గు చూపుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

Bigtv Free Medical Camp: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

CM Revanth Reddy: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

Hyderabad Business Hours: హైదరాబాద్ బిజినెస్ టైమ్ అంటే టైమ్.. తేడా వస్తే ఇక అంతే

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Big Stories

×