EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad Business Hours: హైదరాబాద్ బిజినెస్ టైమ్ అంటే టైమ్.. తేడా వస్తే ఇక అంతే

Hyderabad Business Hours: హైదరాబాద్ బిజినెస్ టైమ్ అంటే టైమ్.. తేడా వస్తే ఇక అంతే

Hyderabad Business Hours: హైదరాబాద్ సిటీలో ఎప్పుడు పడితే.. అప్పుడు షాపింగ్ చేస్తామంటే కుదరదు. పక్కాగా టైమింగ్స్ పాటించాల్సిందేనని అంటున్నారు పోలీసులు. తేడా వస్తే వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.


హైదరాబాద్‌లో షాపుల టైమింగ్స్ మార్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇస్తారు. ఇందులో బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ దుకాణాలు, సెల్‌ఫోన్ దుకాణాలు, సాధారణ దుకాణాలు మరియు బుక్ స్టాల్స్ ఉన్నాయి.

ALSO READ: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు


మద్యం షాపులైతే ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి వుంటాయి. బార్ లు అయితే జీహెచ్ఎంసీ పరిధితోపాటు చుట్టూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు మాత్రమే. వీకెండ్ (శుక్ర, శని) అయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు తెరిచి వుంటాయి.

ఫుడ్ కోర్టులైతే ఉదయం 5 గంటల నుంచి రాత్రి ఒంటి గంట పొడిగించినట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చినట్టు హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా ఉల్లఘించినట్లయితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జోన్ల డీసీపీలు, డివిజన్ ఏసీపీలు, పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.

Related News

CM Revanth Reddy: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

R Krishnaiah: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Thief Arrested: డిపోలోకి వచ్చి మరీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరకు ఎలా దొరికాడంటే..?

Big Stories

×