EPAPER
Kirrak Couples Episode 1

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tammineni Seetaram: తిరుపతి లడ్డూ వివాదంపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరుపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడేందుకు ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ముందుకొచ్చారు. మంగళవారం ఆముదాలవలసలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం వెనుక దాగివున్న కుట్రను సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోపభూయుష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే, సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాం. నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే, 18సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించాం’’ అని తెలిపారు.


Also Read: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

‘‘ఈ రెండింటినీ పరిశీలిస్తే ఎవరి పాలనలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కోట్ల మంది స్వామి వారి భక్తులను తీవ్ర ఆందోళనలోకి నెట్టే పని చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలి. దీని వెనుక దాగివున్న కుట్ర, నిజ నిజాలు ఏమిటో.. వాస్తవాలు ఏమిటో తేలాల్సి ఉంది. తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుదిక్కుల చాటాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఉంటుంది. వీటన్నింటినీ పక్కనపెట్టి రాజకీయాలు చేయాలని చూడటం నిస్సిగ్గుగా బాధాకరం. కలియుగ దైవాన్ని పూజించే కోట్లాదిమంది భక్తులు చంద్రబాబు తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూటమినేతలు గుర్తుంచుకోవాలి’’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

పోషకాహార లోపం ఉన్న ఆవుల వల్లే…

‘‘మాపై ఆరోపణలు చేసే ముందు కూటమి నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరూ.. మీరే కదా..? అప్పుడు తప్పు మీదే అవుతుంది కదా? దీనిపై ల్యాబ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. పోషకాహార లోపం ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కారణమంటూ పేర్కొంది. ఊ ఈ విషయాలు తెలియకుండా మాపై ఆరోపణలు సరికాదు’ అంటూ ఆయన అన్నారు. గ్రామాల్లో అనేక పసువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి. అవి తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి పాలతో చేసే నెయ్యి వల్ల అలా జరుగుతుంది’’ అంటూ కొత్త లాజిక్ చెప్పారు తమ్మినేని.

Related News

Roja: జగన్ పరువు తీసిన రోజా? తిరుమల లడ్డు వివాదంపై పోల్, రిజల్ట్ చూసి దెబ్బకు డిలీట్!

KA Paul: పవన్.. నోరు మూసుకో.. ఆ 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ ఏదీ? : కేఏ పాల్

KA Paul: కేఏ పాల్ అసలు పేరు ఇదేనట.. ‘అప్పట్లో మా నాన్న నన్ను తిరుపతి తీసుకెళ్లి…’

Kiraak RP: రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది.. కిర్రాక్ ఆర్పీ వ్యాఖ్యలు

Tobacco in Laddu : మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Nimmakayala: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

Big Stories

×