ప్రతిరోజు నెయ్యి తింటే .. ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతిరోజు నెయ్యి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతాం అనుకుంటారు. కానీ నెయ్యిలో ఉండే ఫాటీ యాసిడ్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

నెయ్యి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి నెయ్యి అద్బుతంగా పనిచేస్తుంది. అంతే కాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నెయ్యిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ  యాసిడ్స్ మెదడు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

నెయ్యి ఎముక దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ పుష్కలంగ లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.