EPAPER
Kirrak Couples Episode 1

Mynampally: బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు: మైనంపల్లి

Mynampally: బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు: మైనంపల్లి

Mynampally Hanumantarao: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తాజాగా సంచలన కామెంట్లు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్ లో ఉన్నారు. రెండు మంత్రి పదవులిస్తే చాలు బీఆర్ఎస్ ను మొత్తం ఖాళీ చేస్తామని చెబుతున్నారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ తట్టుకోలేదు. బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి వచ్చి చేరుతారు’ అంటూ మైనంపల్లి వ్యాఖ్యానించారు.


Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

‘బావబామ్మర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అసలే సీఎం రేవంత్ రెడ్డి ఊరుకునే వ్యక్తి కాదు.. ఆయన ఏం అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. మీకు సరైన వ్యక్తి ఆయనే. బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు’ అని హనుమంతరావు అన్నారు. మైనంపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.


ఇదిలా ఉంటే.. నేడు తెలంగాణ భవన్ లో శేరిలింగంపల్లి నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏం పాపం చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు.

మంత్రి శ్రీధర్ బాబు అతితెలివిని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. అసలు ఎమ్మెల్యేలకు కండువా కప్పి సన్నాసి ఎవరు? అంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

KTR: మా ఎమ్మెల్యే కేటీఆర్ కనబడుటలేదు.. వెతికి పెట్టండి: పోలీసులకు ఫిర్యాదు

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Onion Prices: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.. ఎంతంటే?

KTR on Hydra: పేదలపైనా మీ ప్రతాపం ?.. హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana Tourism: గోవా వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే!

Big Stories

×