Hebah patel: హీరోయిన్ హెబ్బాపటేల్ ఎందుకోగానీ డల్‌గా కనిపిస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతోంది.
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నమాదిరిగా సాగుతోంది ఆమె కెరీర్. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయ్యింది.
కాకపోతే తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా, కేవలం యంగ్ హీరోతో మమ అనిపించేస్తోంది. ఇప్పటికే 35 ఏళ్ల వచ్చేశాయి.
ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సరసన చేయకుంటే కష్టమని భావిస్తోంది. టాలీవుడ్‌కే కాకుండా తమిళంలో హంగామా చేయాలని భావిస్తోంది.
రెండు సినిమాలు చేస్తోంది. అక్కడైనా గుర్తింపు వస్తోందని బోలెడంత ఆశలు పెట్టుకుంది. తెలుగులో యంగ్ హీరోల సరసన నటించింది.
అప్పుడప్పుడూ స్పెషల్‌గా కనిపిస్తోంది. అన్నట్లు శాండిల్‌వుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చినా, ఎందుకోగానీ అక్కడ క్లిక్ కాలేదు.
దీంతో తెలుగు, తమిళంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాదైనా హెబ్బాకు మరిన్న ఆఫర్లు రావాలని కోరుకుందాం.