EPAPER
Kirrak Couples Episode 1

IPL 2025: MS ధోని కోసం చెన్నై కొత్త కుట్రలు..షాక్‌ లో ఫ్యాన్స్‌ ?

IPL 2025: MS ధోని కోసం చెన్నై కొత్త కుట్రలు..షాక్‌ లో ఫ్యాన్స్‌ ?

CSK Retention List Which 4 Players May Chennai Super Kings Retain Ahead of IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కు ముందుగానే మెగా వేలాన్ని నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మెగా వేలాన్ని నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మునుపటి లాగా ఈ ఏడాది కూడా విదేశాల్లోనే వేలాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారట. గతసారి దుబాయ్ వేదికగా వేలం జరగ్గా ఈసారి అబుదాబి వేదికగా నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి రిటెన్షన్ పాలసీపైనే పడింది.


దీనిపై ఇప్పటికే బీసీసీఐ దృష్టి సారించింది. అన్ని ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సలహాలు, అభిప్రాయాలను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం రిటెన్షన్ కింద నలుగురు ఆటగాళ్లని, ఆర్టియం ద్వారా ఇద్దరు ఆటగాళ్లని మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరుణంలోనే ప్రతి ఒక్కరి చూపు చెన్నై సూపర్ కింగ్స్ పైనే ఉంది. ఎందుకంటే ఎమ్మెస్ ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఇప్పుడు ధోనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది.

CSK Retention List Which 4 Players May Chennai Super Kings Retain Ahead of IPL 2025 Auction

వచ్చే సీజన్లో కూడా మాజీ సీఎస్కే కెప్టెన్ మ్యాజిక్ చూడవచ్చని వార్తలు వస్తున్నాయి. రిటెన్షన్ కు సంబంధించి బీసీసీఐ ఇంకా నిబంధనలను ప్రకటించినప్పటికి సీఎస్కే మాత్రం ధోనిని రిటైన్ చేయాల్సిన ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. చెన్నై ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లని రిటైన్ చేసుకోవచ్చని, ఇద్దరికీ ఆర్టీఎం కార్డులు ఉంటాయని భావించినట్లు మీడియా నివేదికలలో పేర్కొన్నారు.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీ ఋతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎమ్మెస్ ధోని, మతిషా పతిరనలను కొనసాగించాలని ప్లాన్ చేసింది. ధోని తదుపరి సీజన్ లో ఆడతాడా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే మాజీ కెప్టెన్ ప్లాన్ చేసే విలువ కంటే ఎక్కువ డబ్బు కోరుకోవడం లేదు. ఈ కారణంగా అతి తక్కువ మొత్తానికి రిటైన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. లేదా బీసీసీఐ అనుమతిస్తే అతను అన్ క్యాప్డ్ ప్లేయర్ గా తన ఆటను మనం చూడవచ్చు.

Related News

IND VS BAN: రెండో టెస్టులో ఆ డేంజర్‌ ప్లేయర్‌ ను దింపుతున్న రోహిత్..తుది జట్టు ఇదే!

Nicholas Pooran: అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్!

Pakistan: పాకిస్తాన్ కొంప ముంచిన అత్యాశ.. రూ.200 కోట్లు లాస్..?

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Big Stories

×