EPAPER
Kirrak Couples Episode 1

Telangana Tourism: గోవా వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే!

Telangana Tourism: గోవా వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే!

Telangana Tourism Goa Tour Package 2024: టూరిస్టులతో గోవా నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటకులతోపాటు ఎంతోమంది విదేశీయులు విహారయాత్రకు వస్తుంటారు. ఈ గోవా ప్రాంతంలో విహారయాత్ర వినోదాన్నిసంపూర్ణంగా ఎంజాయ్ చేయాలనుకునే వారికి స్వర్గధామమని చెప్పవచ్చు. అందుకే దేశ వ్యాప్తంగా చాలామంది గోవా టూర్ కోసం ప్లాన్ చేస్తుంటారు.


దేశంలో గోవాకు ఓ ప్రత్యేకత ఉంది. మన దేశంలో కేవలం 2 జిల్లాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం కావడం విశేషం. గోవా ప్రాంతంలో అద్భుతమైన బీచ్‌లతో పాటు జలపాతాలు కూడా ఎక్కువసంఖ్యలో ఉన్నాయి. దీంతోపాటు ప్రముఖ చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి. అందుకే తీర ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాలనే వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో నిత్యం గోవా టూరిస్టలుతో కళకళలాడుతూ కనిపిస్తుంది. రోజురోజుకూ టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది.

విదేశీయులు సైతం మన దేశంలో ఎక్కువగా గోవాను సందర్శిస్తున్నారు. మన దేశంలోనూ ముఖ్యంగా ఫ్రెండ్స్, ఆఫీస్ కొలిగ్స్, ఫ్యామిలీ ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొంతమంది సొంత వెహికల్స్‌లో వెళ్తుండగా.. మరికొంతమంది ఇతర వాహనాల్లో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ధరలో సురక్షితంగా హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు టూర్ ప్యాకేజీలను ప్రకటించింది.


గోవా టూర్‌కు సంబంధించి తెలంగాణ టూరిజం ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ గోవా ట్రిప్ ఎన్ని రోజులు ఉంటుంది, టూర్ ప్యాకేజీ తదితర విషయాలు తెలుసుకుందాం. మొత్తం 4 రోజులకు గానూ టూర్ ఉండనుండగా.. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ప్రారంభమవుతుంది. ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సు ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

ఇక, టూర్ ప్యాకేజీ విషయానికొస్తే.. పెద్దలకు రూ.11,999 ఉండగా.. పిల్లలకు రూ.9,599 ఛార్జ్‌గా తెలంగాణ టూరిజం నిర్ణయించింది. ఈ టూర్ ప్యాకేజీలలో గోవాలోని లార్డ్ బోడ్గెశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటి ప్రముఖ బీచ్ లతో పాటు దేవాలయాలు, బోట్ క్రూయిజ్, ఓల్డ్ చర్చిలను సైతం సందర్శించేందుకు అవ

Related News

KTR: మా ఎమ్మెల్యే కేటీఆర్ కనబడుటలేదు.. వెతికి పెట్టండి: పోలీసులకు ఫిర్యాదు

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Onion Prices: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.. ఎంతంటే?

KTR on Hydra: పేదలపైనా మీ ప్రతాపం ?.. హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mynampally: బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు: మైనంపల్లి

Big Stories

×