EPAPER
Kirrak Couples Episode 1

kumkum : ఉంగరం వేలితోనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే.

kumkum : ఉంగరం వేలితోనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే.

kumkum : బొట్టు పెట్టుకోవడం హింధూ ధర్మంలో ఆచారం. ఆ బొట్టును పెట్టుకునేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. బొట్టును కుడిచేతి ఉంగరం వేలతోనే ఎందుకు పెట్టుకుంటారో చాలా మందికి తెలియదు. .ఈ వేలు మూలస్థానం శుక్రుడు,కుజుడు. శుక్రుడు భోగభాగ్యాలను, ఆరోగ్యాన్ని ఇస్తే…. కుజుడు శక్తిని, వీరత్వాన్ని ప్రసాదిస్తాడు. పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ రాణులు బొటన వేలుతో తిలకధారణ చేసే వాళ్ళు. శక్తి, వీరత్వం కలగాలి అని ఉద్దేశంతో అలా చేసేవారు. బొట్టు పెట్టుకుంటే మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. పంచభుతాలలోని ఈవేలుది అగ్ని స్థానంతో సమానం.


చూపుడు వేలు మూలస్థానం గురువు, మోక్షానికి కారకుడు. ఈ వేలుతో మృతశరీరాలకు తిలకధారణ చేస్తారు. మృతశరీరంకి మోక్షం కోసం. గురువు మరుజన్మ లేకుండా చేస్తాడు. అంటే అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ వేలుతో మరణించిన మన పెద్దల ఫోటోలకు తిలకం ఈ వేలుతోనే పెట్టాలి. శుభకార్యలప్పుడు మాత్రం ఈ వేలుని అసలు ఉపయోగించకూడదు. ఈవేలది పంచభుతాలలోని వాయు స్థానం. మధ్యమ వేలు మూలం శనీశ్వర స్థానం. శనీశ్వరుడు ఆయుకారకుడు. ఈ వేలుతో బొట్టుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుంది.ఇతరుల ఆయుష్షుని కోరుకుంటూ మనం ఈ వేలుతో తిలకం పెట్టవచ్చు. పంచభుతాలలోని ఆకాశం స్థానం .

ఉంగరపు వేలుతో ఉషోదయ వేళ మనమందరం ప్రశాంతంగా ఉంటాము. ఉంగరపు వేలు మూలం సూర్య స్థానం. ఈ వేలితో తిలకధారణ ప్రశాంతతకు గుర్తు. దేవుళ్ళ పటాలకి ఈ వేలు తో పెట్టడం మంచిది. పంచభుతాలలోని పృథ్వి స్థానం.చిట్టచివరి వేలు మూలం బుధ స్థానం. బుధుడు విద్యాకారకుడు. వాక్కు, యవన్నానికి, ఆలోచనలకు పంచభుతాలలోని జల స్థానం.


ఇక తిలకధారణ విషయానికి వస్తే, రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఆజ్ఞ చక్రం ఉంటుంది. చందనం ఈ స్థానం మీద పూస్తే మనకు చల్లని అనుభూతి, వైద్యపరంగాను కూడా మంచిది. తిలకధారణకి ఉంగరపు వేలు, బొట్టన వేలు శ్రేష్ఠం. ఆడవాళ్లు ఉంగరపు వేలుతో నుదుటన తిలకం పెట్టుకోవచ్చు.శరీరంలో మొత్తం 13 స్థలాలలో తిలకాన్ని పెట్టుకోవచ్చు. కాని కేవలం నుదుటి మీద మాత్రమే పెట్టుకోవడం వెనుక శాస్త్ర కారణం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మస్తిష్కం మేష రాశి అధీనంలో వుంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు. ఈ కారణం వల్ల ఎరుపు రంగు సింధూరం, చందనం మనం పెట్టుకుంటాం.

Tags

Related News

October Lucky Zodiac: శని-రాహువు కలయికతో 5 రాశులకు అడుగడుగునా ప్రమాదాలే

October Month Lucky Rashifal: అక్టోబర్ లక్ష్మీ నారాయణ రాజయోగంతో వీరి జాతకం మారబోతుంది

Masik Shivratri 2024 September: మాస శివరాత్రి ఎప్పుడు ? తేదీ, పూజ శుభ సమయం ఇవే

Shani Dev: జాతకంలో శని గ్రహం శుభం లేదా అశుభం అయితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి

October 1st Week Lucky Rashi: అక్టోబరు మొదటి వారంలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Sun Ketu Transit: 3 రాశుల జీవితంలో సూర్య, కేతు ప్రభావం.. ఇక అన్నీ అద్భుతాలే

Big Stories

×