EPAPER
Kirrak Couples Episode 1

Budameru vagu: బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు

Budameru vagu: బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు

Budameru vagu: బుడమేరు ఆపరేషన్ చేపట్టేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతోందా? బుడమేరు వాగు ఎన్ని ఎకరాలు కబ్జా అయ్యింది? అక్రమ నిర్మాణాల్లో ఉన్నవారి మాటేంటి? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇవే ప్రశ్నలు కృష్ణా జిల్లా ప్రజలు వెంటాడుతోంది.


ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బుడమేరు వాగు ఆపరేషన్ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇది‌వరకే ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు అధికారులు. ఆ ప్రాంతంపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు.

బుడమేరు వాగుకు సంబంధించి టోటల్ డీటేల్స్ సేకరించారు. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎ. కొండూరు నుంచి విజయవాడ వరకు దాదాపు 40 గ్రామాల పరిధిలో బుడమేరు వాగు వెళ్తోంది. దాదాపు 2,700 ఎకరాల్లో ఈ వాగు ప్రవహిస్తోంది.


ఇందులో 270 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. ఈ విషయం కలెక్టర్ సృజన దృష్టికి వెళ్లింది. 270 ఎకరాల్లో దాదాపు మూడు వేల గృహాలు ఉన్నాయి. దాదాపు 80కి పైగానే నిర్మాణాలను గుర్తించారు. ప్రభుత్వం నుంచి దీనిపై డీటేల్స్ వచ్చిన రంగంలోకి దిగాలని ఆ జిల్లా అధికారులు ఆలోచన చేస్తున్నారు.

ALSO READ: తిరుమల లడ్డూ.. సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ, సిట్‌‌పై కాసేపట్లో ప్రకటన

అక్కడున్న ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపట్టాలని భావిస్తోంది. వాగును కబ్జా చేసినవారికి ఎన్టీఆర్ పేరు మీదుగా ఇల్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరుగు తున్నాయి. రేపో మాపో బుడమేరు వాడు ఆపరేషన్‌పై ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చని అంటున్నారు.

Related News

Nimmakayala: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

Tirumala Laddu Row: లడ్డూ లడాయి.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్లో తప్పేముంది ? ఏపీ ప్రభుత్వంపై అంబటి రాంబాబు ఫైర్..

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘటన… ఎస్ఎంఎస్‌లో ప్రమాదం, కార్మికులకు గాయాలు

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులు.. తొలి విడతలో

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

CM Chandrababu: తిరుమల లడ్డూ.. సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ, సిట్‌‌పై కాసేపట్లో ప్రకటన

Big Stories

×