EPAPER
Kirrak Couples Episode 1

Balineni Vs Damacharla: బాలినేని చిచ్చు.. జనసేన, టీడీపీ మధ్య విభేదాలు?

Balineni Vs Damacharla: బాలినేని చిచ్చు.. జనసేన, టీడీపీ మధ్య విభేదాలు?

War of Words Between Balineni Srinivasa Reddy Vs Damacharla Janardhan: ఒకరు తగ్గేది లేదంటే.. మరొకరు ఒప్పుకునేది లేదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు అనంతరం పలువురు నేతలు వైసీపీని వీడినప్పటికి.. బాలినేని మ్యాటర్ మాత్రం కూటమి పార్టీల్లో కుంపటి రాజేస్తోంది. బాలినేని జనసేనలో చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీలో జాయిన్ అయితే నేతలు కలిసి పని చేస్తారా ? నేతల వ్యవహారశైలితో జనసేన, టీడీపీ మధ్య విబేధాలు తప్పవా అని అనుమానాలు సర్వత్రా వ్యక్తం ఏపీ వ్యాప్తంగా ఒంగోలు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.


ఎన్నికల అనంతరం పలువురు వైసీపీని వీడి టీడీపీ, జనసేన గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని.. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కావడం.. పార్టీలో చేరుతానని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఈ నెల 26న భారీ ఎత్తున చేరికలుంటాయని జనసేన నుంచి అఫీసియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ బాలినేని పార్టీలో చేరక ముందే ఒంగోలు కూటమిలో కుంపటి మొదలైంది. దామచర్ల జనార్ధన్‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌ చర్చనీయాంశంగా మారింది. బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది.

బాలినేని జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నటి నుంచి ఇద్దరి నాయకులు, అనుచరుల మధ్య వార్‌ పీక్‌ స్టేజ్‌కి చేరింది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ మంత్రి బాలినేని మధ్య డైలాగ్‌ వార్‌ రోజురోజుకీ మరింత ముదురుతోంది. బాలినేని జనసేనలో చేరడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక మరో వైపు జనసేన పార్టీలోని రియాజ్‌ వర్గం బాలినేని చేరికపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే దామచర్ల, బాలినేని మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.


ఫస్ట్ నుంచే ఉప్పు నిప్పలా ఉండే బాలినేని, దామచర్ల ప్రస్తుతం కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం బాలినేని అభిమానులు కొందరు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వ్యవహారం ఇప్పుడు మరింత వివాదాలకు దారి తీశాయి. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల ఫోటో కూడా ముద్రించడం టీడీపీలో ఏ మాత్రం మింగుడు పడటం లేదు. పైగా ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఈ రోజు కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. కాపు నాయుకులు వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి కొత్త ఫ్లెక్సీలు తయారు చేయించారు బాలినేని అభిమానులు. ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో కనిపించకపోవడం మరో వివాదానికి తెరలేపింది. దీంతో.. కొందరు జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బాలినేనిపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసిన రియాజ్.. బాలినేని పార్టీలో చేరనున్నట్టు ప్రకటించిన తర్వాత సైలెంట్ అయిపోయారు.

Also Read:  సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్

వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు బాలినేనిని జనసేనలోకి తీసుకోవద్దంటున్నరు. ఆయన్ను జనసేనలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని వాపోతున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఈనెల 26న జనసేన పార్టీలోకి బాలినేని చేరేందుకు సిద్ధమయ్యారు.. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బాలినేని పాల్పడ్డాడని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. తాను ఎప్పుడూ ఏ విషయంలో కాంప్రమైజ్‌ కానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లెక్సీల విషయంలో తనకు ఏమీ తెలియదన్నారు. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు వేశారో తెలియదన్నారు.

ఎమ్మెల్యే జనార్దన్ ఏదేదో మాట్లాడుతున్నారని.. తనపై జనార్ధన్‌ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని.. దీనికి సంబంధించి రెండు వారాల క్రితమే సీఎం చంద్రబాబుకు లెటర్ రాసిన్నట్లు బాలినేని చెప్పారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేసుకోవాలని.. తాను ఏ విచాణకైనా సిద్ధమని బాలినేని అన్నారు. ఓ వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కూటమి లోని జనసేన, బిజెప్ఈ నాయకులను సైతం సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. రీసెంట్ గానే పార్టీ నేతలు తప్పు చేస్తే సహించేది లేదంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ సైతం ఇచ్చారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో కూటమిలో భాగమైన జనసేన పార్టీలో బాలినేని చేరుతుండడం పట్ల ఇంత రాద్దాంతం జరుగుతుంటే చంద్రబాబు ఎలా స్పందిస్తారో అని చర్చ జరుగుతోంది.

ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు ఇంకా పార్టీలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరి మధ్య పోరు మున్ముందు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా? అనే సస్పెన్స్ నెలకొంది.

Related News

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Big Stories

×