EPAPER
Kirrak Couples Episode 1

TDP vs YSRCP Cadre: నూజివీడులో వైసీపీ కార్య‌కర్త నోటి దురుసు.. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై..

TDP vs YSRCP Cadre: నూజివీడులో వైసీపీ కార్య‌కర్త నోటి దురుసు.. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై..

TDP vs YSRCP Cadre: ఏపీలో అధికార టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఎక్కడో దగ్గర గొడవులు జరుగుతూనే ఉన్నాయి. విలేజ్ వ్యవహారాలు కావచ్చు.. పాత పగలు కావచ్చు. ఏది జరిగినా వైసీపీ కార్యకర్తపై దాడి జరిగిందంటూ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేయడం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువైంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి నూజివీడులో చోటు చేసుకుంది.


వైసీపీ కార్యకర్త నాగరాజు ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆయన కాళ్లు, చేతులు కట్టేసి కారులో తీసుకెళ్లారు. అయితే ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు జోరందుకున్నాయి. వైసీపీ కార్యకర్తను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఒకటే వార్త. ఆ వీడియోలను చూసిన నెటిజన్స్ ఇంత దారుణమా అంటూ చర్చించుకోవడం మొదలైంది. కనిపిస్తున్న వీడియో వ్యవహరంలో కావాలని రెచ్చగొట్టింది వ్యక్తి వైసీపీకి చెందిన కార్యకర్త.

ALSO READ: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!


నూజివీడు మండలం.. తుక్కులూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త నాగరాజు.. ఓ వ్యక్తికి ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. దీంతో సంబంధిత వ్యక్తి తన కారులో తుక్కులూరు వెళ్లాడు. వారిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. చివరకు నాగరాజు కాళ్లు, చేతులు కట్టి కారులో వేశారు. అక్కడి నుంచి నేరుగా ఆయా వ్యక్తులు పోలీసులకు అప్పగించారు. ఇదీ అసలు మేటర్. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దీనిపై వైసీపీ అధికార గెజిట్ ‘మానవత్వమా.. కళ్లు మూసుకో’ అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ నాగరాజును లాక్కొని వచ్చిన వ్యక్తి స్థానిక టీడీపీ నేత సురేష్. దీంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేశారంటూ వండి వార్చింది. యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. తమకు చెందిన వ్యక్తికి ఫోన్ చేసి బూతులు తిట్టాడని అంటున్నారు. దీనిపై ఇంటికి వెళ్లి ప్రశ్నించినందుకు తమపై దాడి చేసే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు.

 

Related News

Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్

Mumbi Actress Case: నటి కాదంబరి కేసు, రేపో మాపో ఐపీఎస్‌ల అరెస్ట్! తెర వెనుక చుట్టూ

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

TTD Assets : టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Big Stories

×