Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 8లో నాలుగో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. మొదటి వారం నుండి కంటెస్టెంట్స్ మనసులో ఉన్న మనస్పర్థలను దృష్టిలో పెట్టుకొని ఈవారం నామినేషన్స్‌లో చూపించినట్టు ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. చాలావరకు కంటెస్టెంట్స్ మధ్య ఉన్న మనస్పర్థల గురించే ఈవారం నామినేషన్స్ జరిగినట్టు అనిపిస్తుంది. మొత్తానికి చీఫ్ అవ్వడంతో ఈవారం కూడా నిఖిల్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు. వరుసగా రెండువారాలు నామినేట్ అయిన తర్వాత మరో రెండు వారాలు చీఫ్ స్థానంలో ఉండి నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు నిఖిల్. ఈసారి చాలావరకు కంటెస్టెంట్స్ ఫోకస్ అంతా నిఖిల్, పృథ్వి, సోనియాపైనే ఉంది.
అందరికీ అదే పాయింట్
బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి సోనియా.. నిఖిల్, పృథ్వి ఇద్దరితో క్లోజ్‌గా ఉంటోంది. తనకు బయట బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూనే వీరిద్దరితో వింతంగా ప్రవర్తిస్తోంది. దీంతో హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలయ్యిందని ఆడియన్స్ అనుకోవడం మొదలుపెట్టింది. ఇక గతవారం జరిగిన ఎగ్స్ టాస్క్‌లో సోనియా ఆడించినట్టుగా పృథ్వి, నిఖిల్ ఆడారు. అది అందరు కంటెస్టెంట్స్ చూశారు. అదే పాయింట్‌పై సోనియాను నామినేట్ చేసింది యష్మీ. నబీల్ సైతం సోనియాను ఏమైనా అంటే పృథ్వి, నిఖిల్ మీద పడిపోతున్నారని పాయింట్ చెప్పి తనను నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం కూడా ఎగ్స్ టాస్క్‌లో పృథ్విని రెచ్చగొట్టిందనే కారణంతో సోనియాను నామినేషన్స్‌లో నిలబెట్టాడు.
Also Read: ఏంటి.. బిగ్ బాస్ సోనియాకు ఆల్రెడీ పెళ్లయిందా..? భర్త ఏం చేస్తాడంటే?
కంట్రోల్ తప్పారు
ముఖ్యంగా నబీల్.. సోనియాను నామినేట్ చేస్తున్నప్పుడు నిఖిల్, పృథ్వి మరోసారి తనపై అరవడం మొదలుపెట్టారు. అలా మొత్తానికి సోనియా చుట్టూ నిఖిల్, పృథ్వి బాడీగార్డుల్లాగా తిరుగుతున్నారని తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు. అలా ఈ నామినేషన్స్‌లో సోనియా, పృథ్వి, నిఖిల్ ఫ్రెండ్షిప్ మరోసారి హైలెట్ అయ్యింది. ఎగ్స్ టాస్క్‌లో సంచాలకుడిగా వ్యవహరించినందుకు నబీల్ను కూడా కొందరు టార్గెట్ చేశారు. ముఖ్యంగా పృథ్వి, సోనియా కలిసి తను సంచాలకుడిగా ఫెయిల్ అంటూ వ్యాఖ్యలు చేస్తూ తనను రెచ్చగొట్టారు. దీంతో నబీల్ కూడా నామినేషన్స్‌లో రెచ్చిపోయి కంట్రోల్ తప్పాడు.
తప్పు ఒప్పుకున్న మణికంఠ
నాగ మణికంఠ శారీరికంగా బలహీనంగా ఉన్నాడంటూ ప్రేరణ, యష్మీ, పృథ్వి.. తనను టార్గెట్ చేశారు. తాను శారీరికంగా బలహీనం కాదని చెప్తున్నా వినకుండా తనను రెచ్చగొట్టారు. సీత వచ్చి మణికంఠను నామినేట్ చేస్తూ తను ఎప్పుడు ఎలా ఉంటున్నాడో అర్థం కావడం లేదని చెప్పింది. ఆ పాయింట్‌ను తాను ఒప్పుకొని నామినేషన్స్‌కు నిలబడ్డాడు. చివరిగా పృథ్వి, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, సోనియా, నైనికా, నబీల్, ప్రేరణ.. నామినేషన్స్‌లో ఉన్నట్టు బిగ్ బాస్ తెలిపారు. నిఖిల్ చీఫ్ స్థానంలో ఉండడం వల్ల ఒకరిని సేవ్ చేయవచ్చని అధికారమిచ్చారు బిగ్ బాస్. దీంతో తను నైనికాను సేవ్ చేస్తూ.. తనను నామినేట్ చేసిన పాయింట్స్ స్ట్రాంగ్‌గా లేవని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో సోనియా హర్ట్ అయినట్టు అనిపించింది.