EPAPER
Kirrak Couples Episode 1

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం తిరుమల లడ్డు. అందులో నుంచి చిన్న ముక్క నేలపై పడితేనే ఎంతో అపచారంగా భావిస్తారు. అలాంటిది ఆ లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి కలిసిందని తెలిస్తే? అది భక్తులను ఎంతగా కలిచివేస్తుందనేది మాటల్లో వర్ణించలేం. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. దేవుడి ప్రసాదాన్నే కల్తీ చేసిన కేటుగాళ్లు.. మనం కొనుగోలు చేసే నూనెలను కల్తీ చేయకుండా ఉంటారా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. కొందరు మాత్రం.. నెయ్యి కంటే పంది కొవ్వే ఖరీదైనది, అలా కలిసే ఛాన్సే లేదంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటి కల్తీ నూనెల తయారీకి వాడే జంతువులను అప్పటికప్పుడు వధించి తయారు చేస్తారని అనుకుంటే పొరపాటే. అసలు నిజం తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవుతుంది.


జంతువుల కొవ్వే చీప్

ఈ రోజుల్లో ఏది అసలు.. ఏది నకిలీ అని గుర్తించడం కష్టమే. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న నెయ్యి, నూనెలను చెక్ చేసినా.. షాకింగ్ రిపోర్టులు రావచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేందుకు కొన్ని సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. చీప్‌గా వచ్చే జంతువుల కొవ్వులను నూనెల్లో కలుపుతున్నారు. అదేంటీ.. మార్కెట్లో, మటన్, బీఫ్‌లు అంతేసి ఖరీదు ఉంటాయి. అలాంటిది.. వాటి కళేబరాలతో తయారు చేసే నూనెలు కూడా అంతే ఖరీదు ఉండాలి కదా అని కొందరు లాజిక్కులు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే.. ఆ నూనెల తయారీకి ఎక్కువ శాతం వాడేది బయట అనాథగా చచ్చిపోయే వివిధ జంతువుల మాంసాన్ని. నెయ్యి లేదా నూనెల్లో పంది కొవ్వు అవశేషాలు ఉన్నాయంటే.. తప్పకుండా అవి చనిపోయిన వాటి నుంచి తీసిందే కావచ్చు. ప్రత్యేకంగా వాటిని పెంచి, వధించి నూనెలు తయారు చేసే ఛాన్సే ఉండదు.


ఎలా తయారు చేస్తారు?

చాలామంది జబ్బు పడిన లేదా ఒట్టిపోయిన (పాలు ఇవ్వలేని) ఆవులు, గేదేలను తక్కువ రేటుకు విక్రయిస్తుంటారు. మరికొందరు రోడ్డు ప్రమాదాలు, లేదా జబ్బులతో చనిపోయే జంతువుల కళేబరాలను సేకరిస్తుంటారు. వాటిని ఇలాంటి నూనెల తయారీ సంస్థలకు విక్రయిస్తారు. వారు ఆ కళేబరాలను ముక్కలుగా చేస్తారు. తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వాటిని మరిగిస్తారు. ఆ వేడికి మాంసానికి ఉండే కొవ్వు మొత్తం నూనెలా తయారవుతుంది. దాన్ని ప్రత్యేక పాత్రల్లోకి తీసుకుని, శుద్ధి చేసి.. స్మెల్ రాకుండా రసాయనాలతో ప్రోసెస్ చేస్తారు. పూర్తిగా అవి నూనె తరహా రంగును పొందిన తర్వాత.. ప్యాకెట్లు, టిన్నుల్లో వేసి విక్రయిస్తారు. కొన్ని సంస్థలు బ్రాండెడ్ సంస్థల స్టిక్కర్లు వేసి మరీ విక్రయిస్తాయి. ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అయితే, ఇదంతా గుట్టుచప్పుడుగా సాగిపోయే ప్రక్రియ. అవన్నీ బయటకు సాధారణ నూనె కర్మాగారాలుగా కనిపిస్తాయి. కానీ లోపల జరిగేది మాత్రం ఇది.

మరి.. నెయ్యి, నూనెల్లో ఎలా కలుస్తాయి?

వాస్తవానికి నెయ్యి తయారి చాలా పెద్ద ప్రాసెస్. పాల ఉత్పత్తుల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. పాడి రైతుల నుంచి పాలను సేకరించి.. వాటి ద్వారా స్వచ్ఛమైన నేతిని తయారు చెయ్యాలి. ఇది ఖరీదైన ప్రాసెస్. అందుకే, నెయ్యి ధరలు ఆ స్థాయిలో ఉంటాయి. అయితే, భారీ స్థాయిలో నెయ్యి సప్లయ్ చేసేందుకు కొన్ని సంస్థలు నాణ్యత విషయంలో రాజీపడతాయి. నేతిలో చవకగా లభించే కొవ్వులను కలిపి మాయ చేస్తాయి. ఉదాహరణకు ఒక లీటర్ నెయ్యిలో సుమారు 50 గ్రాముల జంతుకొవ్వుల నూనె కలిపినా.. భారీగా సేవ్ చేయొచ్చు. మనలాంటి సాధారణ ప్రజలు వాటిని గుర్తించలేరు. ల్యాబ్స్‌లో కూడా వివిధ దశల్లో పరీక్షలు చేస్తేనే.. తెలుస్తుంది. అందుకే కేటుగాళ్ల ఆటలు సాగుతున్నాయి. సుమారు నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఇలాంటి కర్మాగారాన్ని ఒకటి గుర్తించారు. అక్కడ వందలాది జంతు కళేబరాలతో నూనెను తయారు చేస్తున్నట్లు తెలుసుకుని అధికారులు షాకయ్యారు. ఆ కర్మాగారం నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.

Also Read: టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

ఎలా గుర్తించాలి?

ఇలాంటి నకిలీలను గుర్తించడం కొంచెం కష్టమే. అయితే, ఆహార నిపుణులు తెలిసిన వివరాల ప్రకారం.. స్వచ్ఛమైన నూనెలను మరిగిస్తే పొంగు రాదు. జంతువుల కళేబరాలతో తయారు చేసిన నూనెలను మరిగిస్తే మాత్రం పొంగు వస్తుంది. అంతేకాదు.. దుర్వాసన కూడా వస్తుంది. ఒక వేళ మీరు కొనుగులు చేసిన నెయ్యి, నూనెల నుంచి స్వచ్ఛమైన వాసన రానట్లయితే.. తప్పకుండా అనుమానించాల్సిందే. ఇలాంటి కల్తీ నూనెలు వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. నూనె, నెయ్యిలను చాలా రకాలుగా కల్తీ చేస్తుంటారు. ఒక వేళ మీరు వాడుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించాలి అనుకుంటే.. ఈ కింది లింక్ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఇక్కడ క్లిక్ చేయండి: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Related News

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

TTD Assets : టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Tirumala Laddu Issue: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Big Stories

×