EPAPER
Kirrak Couples Episode 1

Farmers: మొన్న రుణమాఫీ.. ఇప్పుడు దసరా వేళ రైతులకు మరో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Farmers: మొన్న రుణమాఫీ.. ఇప్పుడు దసరా వేళ రైతులకు మరో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Minister Uttam Kumar Reddy Comments: దసరా వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో భారీ శుభవార్త చెప్పింది. ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ధాన్యం కొనుగోలుపై సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ఈ సమీక్షలో 2024-25 వానా కాలం మార్కెటింగ్ సీజన్ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.


Also Read: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఖరీఫ్ సీజన్ లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట రైతులు సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు గోదాములను ఏర్పాటు చేయనున్నాం. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్

Related News

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Digital Card: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ కార్డు.. ఇకనుంచి అన్ని పథకాలు ఈ కార్డు ద్వారానే…!

Rain Alert: ఇవాళ, రేపు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Mahesh Babu: సీఎం రేవంత్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు భేటీ.. వరద బాధితులకు భారీ విరాళం

Prakash Raj vs VHP: తిరుమల లడ్డూపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు.. నీకెందుకు? అని వీహెచ్ పీ హెచ్చరిక

Big Stories

×