Ritu Varma: అచ్చ తెలుగు హీరోయిన్లతో రీతూ వర్మ ఒకరు. చిన్నచిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఆమె, పెళ్లి చూపులు మూవీతో హీరోయిన్ గా మారింది.
తొలి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె, వరుసగా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తోంది.
అయితే సినిమాలు చేస్తుందికానీ, పెద్ద విజయాలను సొంతం చేసుకోలేకపోతోంది. ప్రస్తుతం రీతూవర్మ స్వాగ్ మూవీలో శ్రీవిష్ణు సరసన నటిస్తోంది.
ఈ ప్రాజెక్టుపైనే బోలెడంత ఆశలు పెట్టుకుంది రీతూ. ఇవన్నీ పక్కనబెడితే సోషల్ మీడియాలో రీతూ నిత్యం యాక్టివ్గా ఉంటుంది.
మరీ అంత బోల్డ్ గా కాకున్నా, తన అందాలతో కుర్రకారును మెప్పిస్తూనే ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్లో రీతూ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.