EPAPER
Kirrak Couples Episode 1

Vodafone-Idea: వొడాఫోన్-ఐడియా వినియోగదారులకు మరోషాక్.. తగ్గిన రోజులు!

Vodafone-Idea: వొడాఫోన్-ఐడియా వినియోగదారులకు మరోషాక్.. తగ్గిన రోజులు!

Vodafone-Idea: ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఇటీవల భారీగా పెంచేశాయి. ఆ పెంచడం కూడా ఐదో పదో కాకుండా ఏకంగా రూ.50కి పైగా ధరలు పెంచేశాయి. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా ఇంతపెద్ద మొత్తంలో రీఛార్జ్ ధరలను పెంచేయడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు. అదే సమయంలో ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్ఎల్ అతి చౌక ధరలోనే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.


దీంతో అప్పటి వరకు నిరాశలో ఉన్న ఇతర సిమ్ కార్డ్ యూజర్లు ఒక్కసారిగా బిఎస్‌ఎన్‌ల్‌కు పోర్ట్ అయిపోయారు. జియో, ఎయిర్‌టెల్, విఐ వినియోగదారులు సగానికి సగం మంది bsnlకు షిఫ్ట్ అయ్యారు. దీంతో మరింత మంది యూజర్లను రాబట్టుకునేందుకు బిఎస్ఎన్ఎల్ అతి తక్కువకే మంత్లీ, ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అంతేకాకుండా త్వరలో తన 4జీ, 5జీ సేవలను సైతం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.

ఈ క్రమంలో మిగతా టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే మిగిలిన యూజర్లను పోగొట్టుకోవడం ఇష్టంలేక అదిరిపోయే ఆఫర్లతో తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే పలు ఆఫర్లతో రీఛార్జ్‌ ధరలను తక్కువకు అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు వచ్చింది. అయితే ఈ సంస్థ ధరలను తగ్గించలేదు. ఎలాంటి ఆఫర్లను అందించలేదు. తమ యూజర్లకు మరో షాకింగ్ విషయాన్ని చెప్పింది. వోడాఫోన్-ఐడియా తాజాగా తన రూ.479, రూ.666 ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించింది.


Also Read: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

రూ.479 ప్లాన్

రూ.479 ప్లాన్‌లో వినియోగదారులు ముందున్న వ్యాలిడిటీ కంటే ఇప్పుడు తక్కువ రోజుల వ్యాలిడిటి పొందుతారు. ముందుగా రూ. 479 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు ఉండగా ఇప్పుడు అది 48 రోజులకు తగ్గించబడింది. ఈ ప్లాన్ ఇప్పుడు 48 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో కస్టమర్లకు డైలీ 1GB డేటా లభిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS పొందుతారు.

రూ. 666 ప్లాన్

కంపెనీ ఇప్పుడు ఈ ప్లాన్ వాలిడిటీని కూడా తగ్గించింది. రూ. 666 ప్లాన్ వాలిడిటీ ముందుగా 77 రోజులు ఉండగా.. ఇప్పుడు 64 రోజులకు తగ్గించబడింది. అయితే ఇందులోనూ మునుపటిలానే అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ కింద కస్టమర్ డైలీ 1.5GB డేటాను పొందుతారు. అందువల్ల చాలామంది వినియోగదారులు ఈ తగ్గింపుపై మండిపడుతున్నారు.

ఇప్పటికే ధరలు పెంచింది కాకుండా ఇప్పుడు వ్యాలిడిటీ కూడా తగ్గించడంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఇలా చేయడంతో కస్టమర్ల బేస్‌పై ప్రభావం చూపుతుందా? అనేది చూడాలి. ఇలా కాకుండా కంపెనీ మరిన్ని ఆఫర్లు తీసుకొచ్చి తమ కస్టమర్లను సంతోష పెడుతుందేమో వెయిట్ చేయాలి. ఇది కాకుండా ప్రతిరోజూ ఎక్కువ డేటా అవసరమైతే రూ. 539 రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా కస్టమర్లు 4GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు పొందుతారు. దీనితో పాటుగా ప్లాన్‌లో బింగే ఆల్ నైట్ డేటా ప్రయోజనం అందించబడుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉంటుంది.

Related News

Netflix Problem For iPhone Users: ఐఫోన్ యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. ఆ మోడల్స్‌లో అప్డేట్ ప్రాబ్లమ్!

iQOO 13: ఐక్యూ నా మజాకా.. మార్కెట్‌లోకి మరో సరికొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Best Phones Launched in September 2024: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Redmi Note 14 Series: కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్లు.. మార్కెట్‌లోకి దించుతున్న రెడ్‌మి!

Flipkart Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Tecno Spark 30: అధునాతన ఫీచర్లతో టెక్నో కొత్తఫోన్ లాంచ్.. లుక్ వేరె లెవెల్ మావా!

Big Stories

×