Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో జంతువుల వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల మనుషుల కంటే జంతువులకు సంబంధించిన వినూత్న ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నాయి. అడవుల్లో నివసించే క్రూర జంతువులు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.
సాధారణంగా ప్రతీ ఇంట్లో ఉదయం లేవగానే కోళ్లు, కుక్కలు, పందులు, పిల్లులు దర్శనమిస్తుంటాయి. ఇలాంటివి సాధారణమే. ఇలా రోజంతా పెంపుడు జంతువులు ఏవి ఎదురైనా కూడా కొత్తగా అనిపించదు. కానీ అదే ఏదైనా క్రూర జంతువులు ఎదురైతే హడలిపోతారు. ఉదయం లేవగానే సింహం, పులి లాంటి జంతువులు దర్శణమిస్తే ఎవరికైనా భయమేస్తుంది. అయితే అలాంటిదే ఓ ఘటన తాజాగా వెలుగుచూసింది.
ఓ వ్యక్తికి ఉదయం లేవగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని చూడాలని అనుకుంటారు. అదే ఏదైనా భయంకరమైన దానిని చూస్తే ఆ రోజంతా భయంతో బ్రతకాల్సి వస్తుంది. సాధారణంగా ఏదైనా క్రూర జంతువును చూడాలంటే అది అడవుల్లో లేక జూలో మాత్రమే సాధ్యమవుతుంది. అదే ఇళ్లలోకి జంతువులు ప్రవేశిస్తే భయంతో వణికిపోతాం. అలాంటిదే ఓ సింహం ఎదురైతే ఇంకేముంది అస్సలు నిద్రపట్టదు. అయితే జూలలో జంతువులకు రక్షణ కల్పించడానికి చాలా మంది సెక్యూరిటీగా ఉంటారు. ఈ క్రమంలో అక్కడే వారు పడుకోవాల్సి వస్తుంది. అయితే వారు నిద్రించడానికి సాధారణమైన గదులు కాకుండా ఐరన్ నెట్స్ తో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వాటిలో వారు ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియో సెక్యూరిటీ గార్డ్ తీసాడా లేక పర్యాటకుడు తీసాడా అనేది మాత్రం తెలియదు. కానీ అతడు ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారిగా కిటికీలోంచి సింహం వచ్చి హాయ్ చెప్పినట్టు కనిపించింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Man wakes up and finds a lion staring at him through his window pic.twitter.com/cy6eQrlvBs
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 21, 2024