EPAPER
Kirrak Couples Episode 1

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Royal Challengers Bengaluru Latest Released and Retained Players List: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్‌ రాబోతున్నాడట. టీమిండియా బ్యాటర్‌, లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్‌ చేయబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అడుగులు వేస్తోందని సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లు అన్నీ కూడా విజయవంతమయ్యాయి.


 

దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పైన ప్రతి ఒక్కరి దృష్టి పడుతోంది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కన్నా ముందు మెగా వేలం జరగనుంది. చాలా రోజుల తర్వాత మెగా వేలాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్లేయర్లు జట్లను మారనున్నారు. రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్లు కూడా ఈసారి మెగా వేలంలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్ ప్లేయర్లు ఎంత ధర పలుకుతారు అనే అంశం పైన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వేలం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో జరిగే ఛాన్సులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.


Royal Challengers Bengaluru Latest Released and Retained Players List

ఈ మెగా వేలం దుబాయ్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ తో కేఎల్ రాహుల్ చేసిన చాట్ ఫ్రాంచైజీలో అతని భవిష్యత్తుపై సందేహాలను లేవనెత్తింది. అయితే రాహుల్ తన కుటుంబంలో భాగం అంటూ సంజీవ్ ఇటీవల పేర్కొన్నారు. జట్టు నుండి ఈ స్టార్ బ్యాటర్ వైదొలగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక 2025 సీజన్ ముందు మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

దీనితో రాహుల్ తన పాత జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరులోకి వెళ్లే అవకాశం ఉందని అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. 2013 నుంచి 2016 వరకు 4 సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఈ స్టార్ ప్లేయర్. దీంతో వచ్చే సీజన్ లో ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్ బెంగళూరులోకి వెళ్లడం ఖాయం అంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి రాహుల్‌ వస్తే… కెప్టెన్‌ కావడం గ్యారెంటీ అంటున్నారు.

అంతకు ముందు రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెట్టోరి, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్ , ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌ లుగా ఉన్నారు. ఇక ఇప్పుడు రాహుల్‌ వస్తే.. కెప్టెన్‌ అవుతాడు. ఈ తరుణంలోనే.. కొన్ని నెగిటివ్‌ కామెంట్స్‌ కూడా వస్తున్నాయి. 100 మంది కెప్టెన్స్‌ మారినా.. ఆర్సీబీ గెలవదని కొందరు అంటున్నారు. మరి ఈసారి ఆర్సీబీ ఎలా ఆడుతుందో చూడాలి.

Related News

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

Big Stories

×