EPAPER
Kirrak Couples Episode 1

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Popping pimples Side Affects| యవ్వనంలో దాదాపు అందరూ ఎదుర్కొనే సమస్య మొటిమలు. నలుగురిలో ఉన్నప్పుడు ముఖంపై మొటిమలుంటే కొంత ఆత్మ నూన్యతకు లోనవుతుంటారు. దీంతో తమ ముఖంపై ఏ మచ్చ మొటిమలు ఉండకుండా క్లియర్ స్కిన్ ఉండాలని అందరూ కోరుకుంటుంటారు. కానీ అది అంత సులువుగా జరిగే పని కాదు.


మొటిమలు మొండిగా వస్తూనే ఉంటాయి. అవి చర్మంపై లావుగా కందిపోయి అందులో ఇన్ఫెక్షన్ వల్ల నొప్పిగా, దురదగా కూడా ఉంటుంది. దీంతో ఆ మొటిమలను చాలామంది చేత్తో గిల్లుతుంటారు. అలా చేయడంతో సమస్యను ఇంకా తీవ్రం చేస్తుందే కానీ పరిష్కారం కాదు. మొటిమలను గిల్లితే అవి పగిలి చర్మానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఆ అలవాటు మారుకుంటారు.

Also Read: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..


1. చర్మంపై మచ్చలు వచ్చే ప్రమాదం
ముఖం లేదా ఇతర భాగాలలో మొటిమలు వస్తే.. అవి నయం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ అందమైన క్లియర్ స్కిన్ కోరుకుంటూ ఒకవేళ మొటిమలను గిల్లితే ఆ ప్రాంతంలో నల్లని మచ్చలు ఏర్పడుతాయి. అప్పుడు మీరు కోరుకున్నది జరగకపోగా ఇంకా ముఖంపై మచ్చలు రావడంతో ముఖం అందవికారంగా మారుతుంది. అందుకే వైద్యులందరూ మొటిమలను గిల్లకూడదని సూచిస్తారు.

2.ఇన్‌ఫెక్షన్ పెరిగే ప్రమాదం
మొటిమలు ఎక్కువగా కాలుష్యం, చర్మంలో నూనె గ్రంధుల స్రావంతో వస్తుంటాయి. లేదా ఏదైనా అలర్జీ ఉన్నా మొటిమలు వస్తాయి. కానీ అవి కాలంతోపాటు క్రమంతా మామమవుతాయి. ఒకవేళ వాటిని తొందపడి గిల్లితే మీ చర్మంపై ఇన్‌ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది. ఇన్‌ఫెక్షన్ పెరిగితే మొటిమలు ఇంకా పెరుగుతాయి. ఇంకా నొప్పిని కలిగిస్తాయి. దాంతో అవి నయం కావడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.

3. మొటిమలు విపరీతంగా పెరిగే ప్రమాదం.
మొటిమలు సహజంగా నయం కావడానికి సమయం పడుతుంది కాబట్టి తొందరపడి వాటిని గిల్లడం అవి పగిలి అందులో నుంచి రక్తం, చీము, కారడంతో ముఖంలోని ఇతర భాగాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అదే జరిగితే మొటిమలు లేని ప్రాంతంలో కూడా విపరీతంగా మొటిమలు వచ్చేస్తాయి.

Also Read:  టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

మొటిమలు రాకుండా నివారించడం ఎలా?
ముఖం లేదా ఇతర భాగాల్లో చర్మంపై మొటిమలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం ప్రతిరోజు నీరు బాగా తాగాలి. దీంతో శరీరంల నీటి కొరత ఉండదు. దీంతో పాటు కూరగాయలు, పండ్లు తినాలి. ఈ అలవాట్లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఒకవేళ మేకప్ వేసుకునే అలవాటు ఉంటే.. రాత్రి నిద్రపోయే ముందు మరిచిపోకుండా మేకప్ తొలగించేయాలి. వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి. మేకప్ కోసం మంచి నాణ్యత గల బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వినియోగించాలి.

Related News

Olive Oil: ఆలివ్ ఆయిల్ అంత ఖరీదు ఎందుకు? ఆరోగ్యానికి అంత మంచిదా?

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Country Chicken Curry: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Big Stories

×