EPAPER
Kirrak Couples Episode 1

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Homemade Face Masks for Healthy Glowing Skin: ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇందుకోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌లు ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉంటే కెమికల్స్ వల్ల చర్మం డామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోవాలంటే మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మీ చర్మం మెరిసిపోవడం పక్కా.. మరీ ఆ మాస్క్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పసుపు, తేనె ఫేస్ ప్యాక్
పసుపులో యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం లోపల పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. పసుపులో టీ స్పూన్ తేనె కలిపి ముఖంపై అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి ఒకసారి చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అదేవిధంగా పసుపును నీటిలో వేసి కొంచెం సేపు మరిగించి ఆ తర్వాత ఆవిరిపడితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్‌తో తేనె ఫేస్ ప్యాక్
ఓట్ మీల్‌తో తేనె ఫేస్ ప్యాక్ వేయాలంటే.. ముందుగా ఓట్ మీల్స్ మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఒక అరగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఓట్ మీల్ చర్మాన్ని ఎక్స్ పోలియేట్ చేయండంలో సహాయపడుతుంది. చర్మంపై ఉండే మృతుకణాలను తొలగిస్తుంది. తేనే చర్మాన్ని సూక్ష్మ క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.


బియ్యంపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
మూడు టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. బియ్యం పిండి అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

Also Read: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి.  అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి చర్మం మెరిసేలా చేస్తుంది.

ఎగ్ వైట్, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఎగ్ వైట్‌లో టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి  అప్లై చేసి  ఉంచండి. ఆ తర్వాత మీరు ఉపయోగించే సోప్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై రంధ్రాలు బిగుతుగా చేసి అదనపు ఆయిల్ విడుదలవ్వకుండా చేయడంలో సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Country Chicken Curry: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Big Stories

×