EPAPER
Kirrak Couples Episode 1

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

TTD Conduct On Hhomam: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయంలో శాంతి హోమం నిర్వహించింది. యాగశాలలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించింది. హోమం అనంతరం అన్ని పోట్లలో సంప్రోక్షణ చేశారు అధికారులు.


లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయ శుద్ధి చేసే పనుల్లో నిమగ్నమైంది టీటీడీ. ఇందులోభాగంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం చేపట్టారు. ఎనిమిది మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహించారు. మూడు హోమ గుండాలతో మహా క్రతువు సాగింది.

పాత్ర శుద్ధి, యంత్ర శుద్ధి, స్థల శుద్దితోపాటు పంచగవ్య సంప్రోక్షన్‌తో కార్యక్రమం ముగిసింది. దీని తర్వాత అన్ని పోటుల్లో అర్చకులు సంప్రోక్షణ చేస్తున్నారు. వాస్తు యాగ తర్వాత లడ్డూ పోటు, అన్న ప్రసాదం పోటు విక్రయశాలలను శుద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూకు వాడే నెయ్యిలో దోషం వల్ల అపచారం జరిగిందన్నారు. ఆగమ సలహాదారుల సలహా మేరకు చేసినట్టు తెలిపారు. లడ్డూ పవిత్రతకు దోష పరిహారం కోసమే యాగం నిర్వహించనున్నాట్లు అర్చకులు తెలిపారు.

ALSO READ: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

ఇదిలా వుండగా తిరుమల లడ్డూ తయారీకి కోసం పంపే నందిని నెయ్యి వాహనలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది కర్ణాటక పాల సమాఖ్య. మార్గ మధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఒప్పందం ప్రకారం మూడు నెలల వరకు ప్రతీనెలా 350 టన్నుల నెయ్యి తిరుమలకు పంపనుంది. ఆ తర్వాత మరో ఆరు నెలలకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరణ చేయనుంది.

 

Related News

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం.. స్వామిని దించిన జగన్, సుప్రీంలో పిటిషన్

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

SIT on Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

Big Stories

×