EPAPER
Kirrak Couples Episode 1

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Animal Fat: మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతీ ఆహార పదార్థాలను చాలా రకాల పదార్థాలు వాడి తయారుచేస్తుంటారు. ముఖ్యంగా జంతువులు కొవ్వులతో తయారు చేసే ఆహార పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. జంతువులు నుంచి లభించే కొవ్వుతో ఆహార పదార్థాలను తయారుచేస్తున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగుచూస్తున్నారు.


తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే పవిత్రమైన ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీంతో ఏ పదార్థాల్లో ఏం వాడుతున్నారో తెలియకుండా పోతుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అసలు ఏ పదార్థాల్లో ఎటువంటి కొవ్వులను వాడుతారనే దానిపై ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది. అయితే అసలు జంతువుల కొవ్వుతో ఏ పదార్థాలను తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

శాఖాహారులు, మంసాహాసారులు అంటూ రెండు విధాలుగా ఉంటారు. శాఖాహారులు ఎక్కువగా మాంసం తినడానికి ఇష్టపడరు. మాంసం మాత్రమే కాదు, ఏ పదార్థాల్లో అయినా జంతువుల కొవ్వు కలిసినా కూడా దానిని అస్సలు కొనుగోలు చేయరు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఏ పదార్థంలో ఏం కలుపుతున్నారో కూడా అర్థం కావడం లేదు. అయితే ఏ పదార్థాల్లో జంతువులు మాంసం కలుపుతారో తెలుసుకుందాం.


జంతువుల కొవ్వును ఉపయోగించే పదార్థాలు ఇవే..

వనస్పతి :

వనస్పతిలో జంతువుల కొవ్వు ను కలిపి తయారు చేస్తుంటారు. అయితే కొన్ని రకాల వనస్పతిలోనే జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు.

బిస్కెట్స్ :

కొన్ని రకాల బిస్కెట్స్, కుకీలలో జంతువుల కొవ్వును కలుపుతారు. వెన్న రుచిలా ఉండే బిస్కెట్స్, కుకీలు తినే వారు జాగ్రత్తగా ఉండాలి.

సాసేజ్‌లు :

సాసేజ్‌, బార్‌లు, మీట్‌బాల్‌లు వంటి వాటిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు.

ఫాస్ట్ ఫుడ్ :

ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్స్ లో జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు.

సూప్‌లు :

కొన్ని సూప్‌లు, స్టాక్‌లలో జంతువుల కొవ్వును ఎక్కువగా వినియోగిస్తుంటారు.

చీజ్ :

జున్ను, ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన చీజ్ లలో జంతువుల కొవ్వును కలుపుతుంటారు.

చాక్లెట్ :

ముఖ్యంగా చాక్లెట్స్ లో ఎక్కువగా జంతువుల కొవ్వును కలుపుతుంటారు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Big Stories

×