EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారం కుదిపేస్తున్నది. గత ప్రభుత్వం తీరని అపచారం చేసిందని, శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉపయోగించారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆ తర్వాత బయటపెట్టిన నివేదికలో ఈ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ఏం చేశారో తెలుసా అని అడిగారు.


అసలు జగన్ గట్స్ ఏమిటో అర్థం కావట్లేదు? ఆయనకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదో? ఎవరిని చూసుకుని వస్తున్నదో తెలియట్లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నదని బాధపడుతుంటే.. ఈయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని వివరించారు. కేంద్రమంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విచారణ చేయాలని రాశారని తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలన కాలంలో తిరుమలను వారు ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్నారని, జగన్ తనవారిని, అన్యమతస్తులను టీటీడీలో నియామకం చేసుకున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీటీడీ చైర్మన్‌గా గతంలో పని చేసిన వ్యక్తి భార్య చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు చైర్మన్‌గా చేసిన భూమన.. తన కూతురుకు క్రైస్తవ ఆచారంలో పెళ్లి చేశారని గుర్తు చేశారు. అంటే.. అన్యమతస్తులను, దేవుడిపై విశ్వాసం లేని వారిని, తన వాళ్లను జగన్ నియమించుకున్నారని పేర్కొన్నారు.


Also Read: Tirupati Laddu: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

టీటీడీతో బిజినెస్ కూడా చేశారని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి గతంలో ఉన్న కఠిన నిబంధనలు ఎత్తేశారన్నారు. సులువైన నిబంధనలు పెట్టి ఏ నిబంధనలూ పాటించని, అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చాడని, తన వాళ్లు డెయిరీ పెట్టిన ఏడాది కూడా గడవకముందే కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. తద్వార నాసిరకం సప్లయర్లకు అవకాశం ఇచ్చారన్నారు. కనీసం డెయిరీ లేనిరవాకి కూడా సప్లై చేసే అవకాశం కల్పించారని మండిపడ్డారు.

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు ఎవరూ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి వెళ్లమని, అది మన ఆచారమని చంద్రబాబు తెలిపారు. తాను కూడా తన తండ్రి చనిపోయినప్పుడు తిరుమలకు వెళ్లలేదని గుర్తు చేశారు. బహుశా అప్పుడు బ్రహ్మోత్సవం కూడా జరిగిందని పేర్కొన్నారు. కానీ, కొడుకు చనిపోయిన 12 రోజులకే తిరుపతికి వస్తారా? అని ఫైర్ అయ్యారు.

సోనియా గాంధీ తిరుపతికి వచ్చినప్పుడు తనకు దేవుడిపై విశ్వాసం ఉన్నదని, అందుకే దర్శనం చేసుకుంటానని అఫిడవిట్ ఇచ్చి దర్శనం చేసుకునేవారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఇలాగే అఫిడవిట్ ఇచ్చి దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. మరి మాజీ సీఎం జగన్ ఎందుకు అఫిడవిట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. వారి కంటే ఈయన గొప్పోడా? అని మండిపడ్డారు.

‘నేను సీఎం కాకముందు తిరుమలకు వెళ్లినప్పుడు ఆ లడ్డూ చూసినప్పుడు చాలా బాధేసేది. గతంలో లడ్డూ కొన్ని రోజులపాటు తాజాగా ఉండేది. గత ఐదేళ్లలో ఈ లడ్డూ గంటల వ్యవధిలోనే పాచివాసన వచ్చేది. పేలవంగా ఉండేది’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘అందుకే తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకు సరైన వ్యక్తి ఎవరా? అని ఆరా తీశాను. శ్యామలరావును రప్పించుకుని ఆయనకే టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించాను. మనం టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పాను’ అని వివరించారు. చెప్పినట్టుగానే శ్యామలరావు అక్కడ యాక్షన్ మొదలుపెట్టాడని తెలిపారు. నాసిరకం సప్లై చేస్తున్నవారిని హెచ్చరించారు. మెమోలు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇన్ని చర్యలు తీసుకున్నాక కూడా నాణ్యత కోసం పరీక్ష చేయగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×