EPAPER
Kirrak Couples Episode 1

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Homemade Hair Oils: ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా చాలా మంది జుట్టు పెరగడానికి రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. మరి కొందరు షాంపూలు, కండీషనర్స్ కూడా ట్రై చేస్తుంటారు. జుట్టు పెరగడం పక్కన పెడితే రసాయనాలతో తయారు చేసిన ఆయిల్స్ వాడటం వల్ల ఉన్న జుట్టు కూడా రాలే అవకాశం ఉంటుంది.


అందుకే బయట దొరికే హెయిర్ ఆయిల్స్ వాడకుండా కొన్ని పదార్ధాలతో ఇంట్లోనే మంచి హెయిర్ ఆయిల్ ను మనం తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మరి జుట్టు వేగంగా పెరగడానికి ఉపయోగపడే హెయిర్ ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఆయిల్స్ తయారీ..
కావలసిన పదార్థాలు:
కొబ్బరి నూనె – 1 కప్పు లేదా 250 గ్రా..
ఆముదం – 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు- 1/2 కప్పు
మెంతి గింజలు – 1 టేబుల్ స్పూన్
బాదం నూనె- వీలైతే


తయారీ విధానం: మొదట మందంగా ఉన్న గిన్నె తీసుకుని గ్యాస్‌పై పెట్టి అందులో పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి నూనె, ఆముదం, వీలైతే బాదం నూనెను వేసుకుని మరిగించాలి. 5 నిమిషాల తర్వాత అందులోనే కరివేపాకు, మెంతి గింజలు వేసి 10 నిమిషాల పాటు సన్నటి మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత గ్యాస్‌పై నుంచి దింపేసి నూనెను వడకట్టుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా 3 నుండి 6 నెలలు వాడితే తప్పకుండా జుట్టు పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది కూడా.

2. కొబ్బరి నూనె, మందార పూలతో హెయిర్ ఆయిల్ ..
కావలసిన పదార్థాలు:

కొబ్బరి నూనె – 1 కప్పు లేదా 250 గ్రా..
కరివేపాకు – 1 కప్పు
మందార పూలు- 3
మెంతులు- 1టేబుల్ స్పూన్
బాదం నూనె – 2 టేబల్ స్పూన్లు

Also Read: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

తయారీ విధానం: మొదట మందంగా ఉన్న గిన్నె తీసుకుని గ్యాస్‌పై పెట్టి అందులో పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి నూనె వేసి మరిగించాలి. అందులోని బాం నూనె వేసి 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత కరివేపాకు, మెంతులు, మందార పూలు వేసి 10-15 మరిగించాలి. నూనె రంగు మారుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్‌ను చల్లారనివ్వాలి. తర్వాత నూనెను వడకట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ వారానికి 1 లేదా 2 సార్లు జుట్టుకు అప్లై చేసుకుని 30 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతోనే తలస్నానం చేయాలి. తరుచుగా ఈ ఆయిల్ వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Big Stories

×