EPAPER
Kirrak Couples Episode 1

Redmi Note 14 Series: కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్లు.. మార్కెట్‌లోకి దించుతున్న రెడ్‌మి!

Redmi Note 14 Series: కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్లు.. మార్కెట్‌లోకి దించుతున్న రెడ్‌మి!

Redmi Note 14 Series: రెడ్‌మి ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో ఉన్న మరో న్యూ మోడల్‌ని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. గతేడాది లాంచ్ అయిన Redmi Note 13 స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా త్వరలో Redmi Note 14 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.


ఈ సిరీస్‌లో Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro + వంటి మోడల్స్ ఉండనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ లాంచ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కంపెనీ అందించలేదు. రాబోయే ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మంచి మన్నిక, వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం IP రేటింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి రెడ్‌మి బ్రాండ్ జనరల్ మేనేజర్ థామస్ వాంగ్ రీసెంట్‌గా వీబోలో ఒక పోస్ట్‌లో మాట్లాడారు. రాబోయే రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు మునుపటి మోడళ్లతో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని తెలిపారు. Redmi Note 14 సిరీస్.. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో గత సంవత్సరం Redmi Note 13 Pro+ ఫోన్ IP68 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.


Also Read: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

జనరల్ మేనేజర్ థామస్ వాంగ్ ప్రత్యేక Weibo పోస్ట్‌లో.. కొత్త నోట్ సిరీస్ ఫోన్‌లు కొత్తగా ప్రారంభించిన iPhone 16 సిరీస్ మాదిరిగా అత్యాధునిక బలమైన డ్రాప్ రెసిస్టెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అయితే Redmi Note 13 Pro+ ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పబడింది.

దీనిబట్టి ప్రో మోడల్‌లో పెద్ద బ్యాటరీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. Redmi Note 14 సిరీస్ ఇటీవల IMEI డేటాబేస్‌లో కనిపించింది. దీంతో ఇది ఈ సెప్టెంబర్‌ నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 7s Gen 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఇది 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని కూడా చెప్పబడుతోంది. ఇది 24094RAD4 మోడల్ నంబర్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కూడా దర్శనమిచ్చింది. దీని బట్టి ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ త్వరలో మార్కెట్‌లోకి రాబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related News

Flipkart Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Tecno Spark 30: అధునాతన ఫీచర్లతో టెక్నో కొత్తఫోన్ లాంచ్.. లుక్ వేరె లెవెల్ మావా!

Best Budget Laptops Under Rs 15000: చీపెస్ట్ ల్యాప్‌టాప్స్.. 5జీ ఫోన్ ధరకే కొనేయొచ్చు, ఫీచర్లు అదిరిపోయాయ్!

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

Big Stories

×