మెంతులతో ఆరోగ్యం రెండింతలు

మెంతులను క్రమం తప్పకుండా రెండువారాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్రమ‌బ‌ద్దీక‌రిస్తాయి.

మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.

అజీర్తి, క‌డుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు త‌గ్గిస్తాయి.

 చెంచా మెంతి గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి  ప‌రిగ‌డుపున తాగితే అజీర్తి సమస్య తొలగిపోతుంది.

మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.

స్థూల‌కాయుల‌కు కూడా మెంతులు నిత్యావ‌స‌రం.

మెంతి గింజ‌ల‌ను వేయించి చేసి పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది.

విరేచ‌నాలు త‌గ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి.