EPAPER
Kirrak Couples Episode 1

Big Shock to IPTV Apps Users: సబ్‌ స్క్రిప్షన్ లేకుండా OTT లో సినిమాలు చూస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడినట్టే..

Big Shock to IPTV Apps Users: సబ్‌ స్క్రిప్షన్ లేకుండా OTT లో సినిమాలు చూస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడినట్టే..

కాబట్టి సంవత్సరానికి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకునే బదులు ఐపీటీవి యాప్స్, ఐపీటీవి సెట్ అప్ బాక్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కంటెంట్ అంతా ఫ్రీ గా చూడొచ్చు. కానీ ఇది ఇల్లీగల్. అక్రమం అని తెలిసిన కూడా చాలా మంది తక్కువ రేటుకే కంటెంట్ వస్తుందని దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. తెలియకుండానే డేంజర్‌లోకి వెళ్తున్నారు. అయితే మన ఇండియాలో ఈ బిజినెస్ తక్కువ. కానీ అమెరికా, కన్నడ, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ.. ఇంకొన్ని కంట్రీస్‌లో ఐపీటీవి చాలా ఫేమస్. అక్కడున్న మన ఇండియన్స్ ఎక్కువగా ఐపీటీవినే వాడుతున్నారు. సింగిల్ పేమెంట్ తో పని అయిపోతుంది. దీనివల్ల ఓటీటీ ఆపరేటర్స్‌కి భారీ నష్టం కలుగుతుంది. ఎక్కువ బడ్జెట్‌తో ఐపీటీవి మూవీస్, వెబ్ సిరీస్, ఒక్క క్లిక్ తో బయటకు వెళ్లి పోతున్నాయి. అదే క్వాలిటీతో ఐపీటీవి యాప్స్‌లోకి వస్తున్నాయి. అటు గామెంట్ ఇన్‌కమ్ కూడా ఈ బిజినెస్‌ని డామేజ్ చేస్తుంది. ఓటీటీ ఆపరేటర్స్ ద్వారా గవర్నమెంట్ వచ్చే టాక్స్ లు తగ్గిపోతున్నాయి. అక్రమంగా బిజినెస్ చేసేవాళ్లు టాక్స్‌లు కట్టరు కాబట్టి మొత్తానికి గవర్నమెంట్ కి భారీ నష్టం.

భారీగీ పెట్టుబడి పెట్టి కొత్త ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్‌లు తీస్తున్న ఓటీటీ మేనేజ్మెంట్లు, సబ్ స్క్రిప్షన్ పెరగకపోతే పెద్దగా ఆశక్తి చూపించరు. కాబట్టి కొత్త కంటెంట్ రాకపోవచ్చు. దీనివల్ల ప్లాట్ ఫామ్స్ కాదు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి, డెవలప్ చేసే బ్రాడ్ కాస్టర్స్, కంటెంట్ క్రియేటర్స్, యాక్టర్స్, ఆర్టిస్ట్, వీరి భవిష్యత్తు దెబ్బతింటుంది. ఓటీటీల వల్ల పెరుగుతున్న జాబ్ ఆఫర్స్‌కి మేజర్ డామేజ్ జరుగుతుంది. సబ్ స్క్రైబర్ సపోర్ట్ లేకుండా దీన్ని కంట్రోల్ చేయడం ఇంపాజిబుల్. కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఆ దిశగా అవహన పెంచేందుకు ట్రై చేస్తున్నాయి. అయినా కూడా మేము పైరసీనే ఎంకరేంజ్ చేస్తాం అనే వాళ్లని మాత్రం జరిమానా, లీగల్ యాక్షన్‌తో పోలీసులు భయపెడుతున్నారు. యూజర్స్‌కి మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి పైరేటెడ్ కంటెంట్‌ని చూడటం, అక్రమంగా ఐపీటీవి సెట్ అప్ బాక్స్ లను కొనడం, అమ్మడం రెండూ క్రైమే. అమెరికా, యూకేలో ఇలాంటి బిజినెస్‌లు చేస్తున్న వారిపై, యూజర్స్‌పై పోలీసులు నిఘాపెట్టారు.


Also Read: ఏడాది తర్వాత ఓటీటీలో కి హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రీసెంట్‌గా యూకేలో వెస్ట్ మెర్శియా పోలీసులు ప్రతి ఇంటిని చెక్ చేశారు. వెయ్యి మంది అక్రమంగా ఐపీటీవి బాక్స్‌లు, ఫైర్ స్టిక్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు తేలింది. వారందరిపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం మే నెలలో ఐపీటీవీ సబ్ స్క్రిప్షన్ సేల్ చేసినందుకు ఓ వ్యక్తికి 30 మిలియన్ డాలర్స్ జరిమానా వేశారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఫైర్ స్టిక్స్, ఐపీటీవీ సబ్ స్క్రిప్షన్ అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంతేకాదు అక్రమంగా ఐపీటీవి సెట్ అప్ బాక్స్‌లు తీసుకున్నవారికి కూడా జైలు శిక్ష పడింది. ఇటీవల ఇటలీ కూడా పైరసీ షీల్డ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఫారెన్‌లో ఉన్న చాలామంది ఈ చెకింగ్స్‌లో దొరికారు. కాబట్టి మీరు డేంజర్ జోన్‌లో ఉంటే మాత్రం వెంటనే బయటకు రండి.

రెండవది చాలా ముఖ్యమైనది. ఐపీటీవి యాప్స్, ఐపీటీవి సెట్ అప్ బాక్స్‌ని అక్రమంగా సేల్ చేస్తున్న వారు ఎవరో మీకు తెలుసా? మీరు పే చేస్తున్న వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ ఫీజు ఎవరికి వెళ్తుందో మీకు తెలుసా? మీరు ఇస్తున్న డబ్బులతో ఏఏ అక్రమ బిజినెస్‌లు చేస్తున్నారో మీకు అవగాహన ఉందా? రీసెంట్‌గా నగారా టెక్నాలజీ దీన్ని వెలుగులోకి తెచ్చింది. పైరేటెడ్ కంటెంట్ కోసం మనం పే చేస్తున్న డబ్బులు మాఫియా చేతిలోకి వెళ్తున్నాయి. ఈ మాఫియా నుంచి డ్రగ్స్ డీలింగ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, హ్యూమన్ ట్రాఫింగ్స్, ఇతర అక్రమాలకు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మనం పే చేస్తున్న అమౌంట్ డ్రగ్స్ ఢీలర్స్, టెర్రరిస్ట్ చేతిలోకి వెళ్తుందంటే ఒక్క సారి గుర్తుచేసుకోండి. మనం ఎంత పెద్ద క్రైమ్‌కి సపోర్ట్ చేస్తున్నామో.. కాబట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. పైరసీ కంటెంట్ తక్కువ రేటుకి వస్తుంది కాదా అని దాన్ని ఎంకరేజ్ చేస్తూ బిగ్ క్రైమ్‌లో పార్టనర్స్ కావద్దు.

ఇక మూడవ ప్రాబ్లమ్ పర్సనల్ డేటా క్లోనింగ్. ఒక్క సారి మీ ఫోన్‌లో ఐపీటీవీ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నాక.. మీ పర్సనల్ డీటైల్స్‌ని క్లోన్ చేస్తుందన్న విషయం మీకు తెలుసా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ విషయాలన్ని డార్క్ వెబ్ లోకి వెళ్లి పోతున్నాయి. ఐపీటీవీ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వారి వివరాలన్ని స్కామర్స్ సులభంగా కనిపెడుతున్నారు. ఆ వివరాలతో వారు అకౌంట్స్‌ని ఖాళీ చెయ్యొచ్చు. లేదా ఇంకేదైనా క్రైమ్‌కి ఉపయోగించవచ్చు. మీ పర్శనల్ డీటైల్స్ ని బయటపెట్టి ఫామిలీ రిలేషన్స్‌ను కూడా డిస్టర్బ్ చేయొచ్చు. ఐపీటీవి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపించి వివరాలన్ని తెలుసుకుంటున్నారు స్కామర్స్.

ఓటీటీ సబ్ స్క్రిప్షన్‌కి బదులు అక్రమంగా ఐపీటీవీ వైపు మనం ఎట్రాక్ట్ అయితే అది ఎంత డేంజరో ఒకసారి గుర్తించుకోండి. ఇంకా సినిమా, వెబ్ సిరీస్, వీడియో కంటెంట్ , టెక్స్ట్ కంటెంట్ అనేది.. ఈజీగా పైరసీ చేయొచ్చు. అది ఇల్లీగల్ యాక్టివిటీ అయినా కూడా మన దగ్గర చట్టాల్లో అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ ఫారెన్ కంట్రీస్‌లో ఈ పైరసీ అనేది చాలా పెద్ద క్రైమ్. ఈ పైరసీ కంటెంట్‌ని ప్రొవైడ్ చేసినవాళ్లు తెలిసి తెలియక యాక్సెస్ చేసినవాళ్లు అందరూ ఈ క్రైమ్ లో భాగమే. ముఖ్యంగా ఈ పైరేటెడ్, ఐపీటీవీ యాప్ జోలీకి మీరు అస్సలు వెళ్లొద్దు. చిత్రం టీవీ, బాస్ ఐపీటీవి, తాషాన్ ఐపీటీవి, రియల్ టీవి, జడో, మాక్స్, వీ బాక్స్, పంజాబీ ఐపీటీవి, ఇండియన్ ఐపీటీవి, ఇవన్నీ ఈ లిస్టులో ఉన్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

 

Related News

Horror Movie OTT: ఏడాది తర్వాత ఓటీటీలో కి హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : చెవిటివాడు స్పై అంటూ ఇన్వెస్టిగేషన్… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే స్పై థ్రిల్లర్

OTT Movie : మీనా నటించిన దృశ్యం లాంటి ట్విస్ట్ లున్న మూవీ… క్లైమాక్స్ అదుర్స్

OTT Movie : చచ్చిన బ్రిటిష్ ప్రేతాత్మలతో యుద్ధం… భయంతో చెమటలు పట్టించే హారర్ మూవీ

OTT Movie : కోడలిని లొంగదీసుకునే మామ.. డైరెక్టర్ కు దేహశుద్ధి జరిపిన అమలా పాల్ బో*ల్డ్ మూవీ

35 Chinna Katha kaadhu: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన 35 చిన్న కథ కాదు. ఎప్పటినుంచంటే..?

Big Stories

×