EPAPER
Kirrak Couples Episode 1

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

PM Modi Quad| అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (అమెరికా సమయం) సర్వికల్ క్యాన్సర్ పోరాటం కోసం భారత దేశం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అమెరికాలోని డెలావేర్ లో జరిగిన క్యాన్సర్ మూన్‌షూట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా క్వాడ్ దేశాలు(భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా).. సర్వికల్ క్యాన్సర్ అవగాహన, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇండియా తరపున ప్రధాని మోదీ 75 లక్షల డాలర్లు, 4 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేస్తుందని ప్రకటించారు.


ముఖ్యంగా ఈ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు.. ఇండో పసిఫిక్ దేశాలలో(40 దేశాలు) పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ 19 పాండమిక్ సమయంలో క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం అమెరికా చేపట్టినందుకు ఆయన జో బైడెన్ ని ప్రశంసించారు. సర్వికల్ క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులతో పోరాడేందుకు ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని.. అందుకోసం క్యాన్సర్ నివారణ అవగాహన, స్క్రీనింగ్, డయగ్నోసిస్, చికిత్స, వ్యాక్సిన్ల సరఫరాని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్వాడ్ దేశాలు పనిచేస్తాయని అన్నారు.

Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!


”క్వాడ్ దేశాలు.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ డిటెక్షన్, నివారణ, చికిత్స కోసం కృషి చేస్తాయి. ‘ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ అనే నినాదంతో ఇండియా పనిచేస్తుంది. ఇండో పసిఫిక్ దేశాలలో క్యాన్సర్ టెస్టింగ్, స్క్రీనింగ్, డయాగ్నస్టిక్స్ లాంటి సౌలభ్యాల కోసం ఇండియా 75 లక్షల అమెరికన్ డాలర్లు ప్రధాని ప్రకటించారు.” అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వార్ ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు.

సర్వికల్ క్యాన్సర్ కోసం ఇండియా సొంత వ్యాక్సిన్
అమెరికాలో జరిగిన క్వాడ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సర్వికల్ క్యాన్సర్ కోసం ఇండియా సొంత వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసిందని.. దాని స్క్రీనింగ్ జరుగుతోందని… చాలా తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో తయారీ జరుగుతోందని తెలిపారు. అదనంగా ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలవుతోందని.. అందరికీ అందుబాటులో ఔషధాలు ఉండేందుకు స్పెషల్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సర్వికల్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ ప్రొటోకాల్స్, కొత్త వ్యాక్సిన్ అభివృద్ది చేశామని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ లో భాగంగా తమ వ్యాక్సిన్ ఫార్ములాని ప్రపంచదేశాలతో పంచుకునేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు.

Also Read: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యతో పోరడడానికే క్వాడ్ దేశాలు ముందుకొచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో భారత దేశం 10 మిలియన్ డాలర్ల కమిట్ మెంట్ ఇచ్చింది. అందులో భాగంగానే 7.5 మిలియన్ డాలర్లు సర్వికల్ క్యాన్సర్ వైద్యానికి ఖర్చు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

Related News

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Big Stories

×