EPAPER
Kirrak Couples Episode 1

Hair Growth Tips: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

Hair Growth Tips: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

Hair Growth Tips: ప్రతి రోజు కొంత జుట్టు రాలడం సాధారణమే.. కానీ ఎక్కువ జుట్టు రాలిపోతే అది తీవ్రమైన సమస్యగా గుర్తించాలి. చాలా మంది జుట్టు రాలే సమస్యతో ప్రస్తుతం పోరాడుతున్నారు. జుట్టు విపరీతంగా రాలడం ప్రారంభిస్తే బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతిరోజు బ్యూటీ పార్లర్లు, హెయిర్ సెలూన్లలో వేలల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే మరి కొందరు జుట్టు రాలకుండా ఖరీదైన ఆయిల్స్, షాంపూలను వాడుతున్నారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో హోం రెమెడీస్ ట్రై చేయవచ్చు.  మరి హోం రెమెడీస్ ఎలా తయారు చేయాలి. అంతే కాకుండా వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు హెయిర్ ఆయిల్ :
కరివేపాకు నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్ కరివేపాకులను తీసుకుని బాగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్‌పై ఒక మందపాటి గిన్నె పెట్టుకుని 1 కప్పు కొబ్బరి నూనెను వేసి వేడి చేయండి. అందులో ముందుగా తీసుకున్న కరివేపాకు వేయాలి. ఈ నూనెను తక్కువ మంట మీద ఉడికించాలి. 15-20 నిమిషాల తర్వాత నూనె రంగు మారుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి నూనెను చల్లారనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న ఈ నూనెను తలకు అప్లై చేయండి. దీనిని 30 నిమిషాలు ఉంచిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. కరివేపాకులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.


కొబ్బరి పాలు:
కొబ్బరి పాలు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. దీన్ని తలకు నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు. కాస్త కొబ్బరి పాలను తీసుకుని జుట్టు మూలాలకు అప్లై చేసి, నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆ తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచి షాంపూతో తలస్నానం చేయండి. కొబ్బరి పాలలో జుట్టు పెరుగుదలకు సహాయపడే విటమిన్లతో సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. తరుచుగా కొబ్బరి పాలు జుట్టుకు అప్లై చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Also Read: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

ఎగ్ :
వారానికి ఒకసారి ఎగ్ హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయండి. ఇందుకోసం ఎగ్‌ వైట్ తీసుకుని, దానికి కాస్త ఏదైనా హెయిర్ ఆయిల్ కలపండి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

తడి వెంట్రుకలను దువ్వుకోకండి..
చాలా మంది తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వుతుంటారు. తడి జుట్టును దువ్వడం వల్ల మీ జుట్టు మూలాల నుంచి బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా సులభంగా రాలిపోతుంది. తడి జుట్టు ఒకదానికొకటి చిక్కుకుపోయి ఉంటుంది. కాబట్టి జుట్టు ఆరిపోయిన తర్వాత మాత్రమే దువ్వాలి. లేదంటే ఎక్కువగా జుట్టు రాలిపోతుంది.

Related News

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Apple for Face: యాపిల్‌తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? తళుక్కుమనే అందం మీ సొంతం

Brown Rice: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

Big Stories

×