EPAPER
Kirrak Couples Episode 1

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

Infinix Zero Flip| ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ ఈ రోజుల్లో రెగులర్ మొబైల్స్ కన్నా ఫ్లిప్ ఫోన్ లేదా ఫోల్డ్ ఫోన్ పై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఇన్‌ఫినిక్స్ మార్కెట్లో చీపెస్ట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. అత్యంత తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కావడంతో ఈ ఫ్లిప్ ఫోన్ శాంసంగ్, మోటరోలా, ఒప్పో లాంటి బ్రాండ్ ఫ్లిప్ ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వనుంది. దీని పేరుని కూడా కంపెనీ రివీల్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G.. కంపెనీ లాంచ్ చేసే మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ అని ఒక టిప్‌స్టర్ దీని పోస్టర్ కూడా లీక్ చేశాడు. దీని ధర దాదాపు రూ.55000 లేదా అంతకంటే తక్కువే ఉండే అవకాశముంది.


భారతదేశంలో ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G త్వరలోనే లాంచ్ కానుందని కనీసం రెండు కలర్ వేరియంట్స్ మార్కెట్లో రావొచ్చు. ఈ వివరాలన్నీ చూస్తుంటే ఈ ఫ్లిప్ స్మార్ట్ డివైస్ Motorola Razr 50, Tecno Phantom V Flip 5G ఫ్లిప్ , ఫోల్డెబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ధర పోల్చి చూస్తే.. Infinix Zero Flip 5G.. శాంసంగ్ లేటెస్ట్ Z Flip 6 కంటే సగం ధరకే లాంచ్ కానుంది. ఇండియన్ మార్కెట్లో Samsung Galaxy Z Flip 6 ధర రూ.1,09,999 ఉంది.

Infinix Zero Flip 5G ఇండియన్ మార్కెట్లో అత్యంత తక్కువ ధర ఫ్లిప్ ఫోన్ అని కంపెనీ స్వయంగా ట్విట్టర్ ఎక్స్ లో ఒక టీజర్ వీడియో పోస్ట్ చేసింది. అంతకంటే ముందు వియత్నాంలో ఈ ఫోన్ డిజైన్, కొన్ని ఫీచర్ల గురించి ఒక పోస్టర్ లీక్ అయింది. దీనికి కంపెనీ అధికారికంగా టీజర్ లో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ వీడియోలో తెలిపింది.


Also Read:శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

ఇండియాలో Infinix Zero Flip 5G ధర ఎంత?
స్మార్ట్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా సమాచారం అందించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లున్సర్ పారస్ గుగలానే తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో Infinix Zero Flip 5G డిటైల్స్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో అతన Infinix Zero Flip 5G హెడ్ సెట్ ధర ఇండియా, గ్లోబల్ మార్కెట్లో రూ.50000 నుంచి రూ.55000 దాకా ఉండొచ్చని తెలిపాడు.

Infinix Zero Flip 5G ఫీచర్ల ఎక్స్‌పెక్టేషన్స్
డిస్‌ప్లే : Infinix Zero Flip 5G లో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.7-inch FHD+ AMOLED ఫోల్డెబుల్ డిస్‌ప్లే ఉండే అవకాశముంది. ఈ కవర్ డిస్‌ప్లే సైజు 3.64 ఇంచులు ఉండొచ్చు. రెండు డిస్‌ప్లే లు కూడా కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి.

పర్ఫార్మెన్స్ : బడ్జెట్ కేటగిరీ స్మార్ ఫోన్ కావడంతో ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంటుంది. 16GB LPDDR4X RAM, 256GB UFS 3.1 స్టోరేజి ఫీచర్స్ ఉండే అవకాశముంది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ స్మూత్ గా మల్టి టాస్కింగ్ చేస్తూ.. కావాల్సినంత సోరేజీ అందిస్తుంది.

కెమెరా : ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ లో డుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 10.8MP సెకండరీ సెన్సార్ ఉండొచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ సౌకర్యాలు కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైస్ అన్ని 4K వీడియో రికార్డింగ్స్ సపోర్ట్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కు వీడియో క్రియేషన్ కోసం ఇది చాలా ఉపయోగకరం.

సాఫ్ట్ వేర్ : Infinix Zero Flip 5G లో XOS 14.5 ఆధారంగా రన్ అయ్యే ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్ వేర్ ఉంది. పైగా యూజర్లు సీమ్ లెస్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు ఇందులో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Related News

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Big Stories

×