EPAPER
Kirrak Couples Episode 1

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

Samsung Galaxy S24 FE, Galaxy Tab S10 Series: ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్‌కి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కారణంగానే కంపెనీ తరచూ ఏదో ఒక ప్రొడెక్టును లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, ఇయర్‌బడ్స్ సహా ఇతర ప్రొడక్టులను తీసుకొస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక త్వరలో తన లైనప్‌లో ఉన్న Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ ట్యాబ్ S10 సిరీస్‌తో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ Samsung Galaxy S23 FEకి సక్సెసర్‌గా వస్తుందని భావిస్తున్నారు.


అంతేకాకుండా కంపెనీ ఈ ఫోన్‌లో అధునాతన Galaxy AI ఫీచర్లను సైతం అందుస్తుందని అంటున్నారు. దీంతోపాటు Galaxy Tab S10 సిరీస్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే కంపెనీ ఇటీవల భారతదేశంలో తన నెక్స్ట్ జెన్ టాబ్లెట్‌ల కోసం రిజర్వేషన్‌లను ఓపెన్ చేసింది. అయితే దీనికి సంబంధించిన లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. తాజాగా Samsung Galaxy S24 FE, Galaxy S10 సిరీస్ లాంచ్ డేట్ లీక్ అయ్యాయి.

సెప్టెంబర్ 26న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుందని తెలుస్తోంది. రీసెంట్‌గా దీనికి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ కాగా.. దాని ప్రకారం.. సెప్టెంబర్ 26న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ లాంచ్ ఈవెంట్ రాత్రి 10 గంటలకు వియత్నాంలో జరుగుతుందని సమాచారం. భారతదేశంలో ఇది రాత్రి 8:30 గంటలకు ప్రసారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Also Read: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

అయితే ఈ Samsung గెలాక్సీ అన్‌ప్యాక్డ్ లాంచ్ ఈవెంట్ కోసం కంపెనీ ఇంకా అఫీషియల్ తేదీని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే Samsung భారతదేశంలో రాబోయే టాబ్లెట్‌ల కోసం ‘ప్రీ-రిజర్వేషన్‌లను’ ప్రారంభించింది. కస్టమర్లు యాక్సెస్ ఆఫర్‌లకు బదులగా టాబ్లెట్‌లను కొనుక్కోవడానికి ముందుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. Samsung వెబ్‌సైట్, Samsung India Smart Cafés, Amazon, Flipkartతో సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం.. Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది Exynos 2400e ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.

అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4565mAh బ్యాటరీని ప్యాక్‌తో వస్తుంది. ఇది కాకుండా Galaxy Tab S10+, Galaxy Tab S20 Ultra 12.3-అంగుళాలు, 14.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లేలతో రానున్నాయి.

అయితే దీనికంటే మునుపటిది 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అల్ట్రా మోడల్ డ్యూయల్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. రెండు మోడల్‌లు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

Related News

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

Big Stories

×