పిల్లల్ని కనడం అనేది చాలా మంది మహిళల కల. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు.

ఒక్కసారి కలిస్తే ప్రెగ్నెంట్ అవ్వడమనేది చాలా కష్టం.

దానికి కొన్ని టైమింగ్స్, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి.

అందుకే ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే కపుల్స్ రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనాలి.

రోజూ వీలుకాకపోయినా కనీసం వారానికి 2, 3 సార్లైనా ఆ కార్యంలో పాల్గొనాలి.

ముఖ్యంగా ఓవులేషన్ టైమ్‌లో కలిస్తే మరింత తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

పీరియడ్స్ ఎన్నిరోజులకి ఓ సారి వస్తుందో చెక్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైమ్‌లో కలిస్తే రిజల్ట్ పక్కాగా వస్తుందని అంటున్నారు వైద్యులు.

అయితే దీనికోసం డాక్టర్‌ని కలిసి సలహా తీసుకోవచ్చు.

లేదంటే మెనుస్ట్రువల్ యాప్, డైరీని వంటి వాటిని వాడొచ్చు. దీని వల్ల మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు.

పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశం తగ్గుతుంది.

అందువల్ల వీటికి దూరంగా ఉండటమే కాకుండా.. వైద్యుని సలహాలు పాటిస్తే పిల్లల్ని కనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.