EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

Will Hyderabad Escape from Floods: ప్రకృతి ఎంత అందమైనదో.. ఎంత ప్రశాంత వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ, అంతేస్థాయిలో అప్పుడప్పుడు ప్రకోపాన్ని కూడా సైతం చూపిస్తుంటుంది. ప్రశాంత వాతావణరంలో తన ఒడిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. అంతేస్థాయిలో అప్పుడప్పుడు తన కోపాన్ని కూడా చూపిస్తుంటుంది. ఆ సమయంలో అంతా కప్పి పెట్టుకుపోతుంటది. ఆ సమయంలో విలయతాండవం చేస్తూ తన కోపం ఎలా ఉంటుందో మానవులకు ప్రత్యక్షంగా చూపిస్తుంటది.


అయితే, ఇదంతా ఇప్పుడెందుకు దీనిపై చర్చ అంటే.. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలోనే కాదు.. దేశ, విదేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీంతో చాలామంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. మిగిలినవారు సర్వం కోల్పోయి దిక్కు తోచని పరిస్థితిని చూడక తప్పడంలేదు. మరికొంతమంది గురించి వివరించాలన్నా కూడా తోచని విధంగా ఆ వైపరీత్యాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఈ క్రమంలో నిపుణులు తీవ్రంగా ఆలోచన చేసినా, ఇటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాల్లో వాళ్లు తెలుసుకుని చెబుతున్న వాటిలో ముఖ్యంగా ఒకటి ఉంది. అదేమంటే.. మానవ తప్పిదం. ఇదే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమవుతుందని చెబుతున్నారు. వీరి వల్లనే భూకంపాలు, వరదలు, సుడిగాలులు, సునామీలు… సంభవిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనిషి ప్రకృతిని ప్రేమించాలని.. వైపరీత్యాలకు కారణం కాకుండా వ్వవహరించాలని చెబుతున్నారు. ఇటు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలే కాకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రకృతి తన ప్రకోపాన్ని చూడక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read: ఆయన పోరాట స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్


అయితే, వాస్తవానికి ఈ విషయంలో ప్రకృతి ప్రేమికులు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. సంబంధిత రంగాలకు చెందిన సైంటిస్టులు సైతం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే పర్యవరణాన్ని కాపాడటం ఎంతో ముఖ్యమో వివరిస్తూనే ఉన్నాయి. దానిని కాపాడితే మనిషికి ఏ విధంగా మేలు జరుగుతుందో అనేది కూడా ప్రముఖంగా చెబుతూనే ఉన్నారు. లేకపోతే అటువంటి వైపరీత్యాలకు గురికాక తప్పదంటూ ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు.

కానీ, చాలామంది.. ఏది ఏమైతే నాకేంటీ? నేను ఇప్పుడు ప్రజెంట్ గా సేఫ్ గా ఉన్నానా లేదా? అన్నది ముఖ్యం అన్న చందంగా బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకొందరైతే పక్క వాళ్లకు ఏం జరిగినా సరే నేను, నా ఫ్యామిలీ బాగుందా లేదా అన్నదే తమకు ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం కూడా పర్యావరణాన్ని కాపాడే విషయంలో బాధ్యతగా వ్యవహరించడంలేదు. ప్రభుత్వం నిబంధనలను విధించినా వాటిని పెడచెవిన పెడుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.

మనిషి ప్రస్తుతం భూమి మీదే కాదు.. చంద్రమండలం పైన అడుగు పెట్టిన విషయం కూడా తెలిసిందే. అక్కడే నివాసాన్ని సైతం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు. ఇంతలా మానవుడు అభివృద్ధి చెందాడు. ఆదిమానవుడి దశ నుంచి నేడు ఏ దశకు చేరుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇందుకోసం ప్రకృతి అందించే అవకాశాలను సైతం వాడుకుంటున్నాడు. కానీ, చివరకు అదే పర్యావరణం కాలుష్యానికి కారకుడవుతున్నాడు. నాడు రాజుల కాలంలో కూడా ప్రకృతికి చాలా ప్రిపరెన్స్ ఇచ్చేవారు. అందుకు ప్రత్యేక ఉదాహరణే అప్పటి కట్టడాలు ఇప్పటికీ మనముందు ఎన్నో ఉన్నాయి. వాటి నిర్మాణాన్ని పరిశీలిస్తే అద్భుతాలు మనకు కనిపిస్తుంటాయి. కారణం వారు ప్రజెంట్ కాదు.. ఫ్యూచర్‌ను కూడా ఆలోచించి ముందుకెళ్లేవారు.

Also Read: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

అందులో ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో ప్రముఖంగా ఇప్పటికీ సాక్షంగా నిలిచినవి గొలుసుకట్టు చెరువులు. ఆనాటి కాకతీయులు వీటిని నిర్మించారు. భవిష్యత్ ను ఆలోచించి ఈ చెరువులను ఏర్పాటు చేశారు. వీటి ఫలాలనే ఇప్పటికీ ప్రస్తుతం జనాలు ఆస్వాదిస్తున్నారు. అంటే.. వారు ప్రకృతికి ఎంతలా ప్రిపరెన్స్ ఇచ్చారో ఇట్టే అర్థమవుతుంది. పాఠ్యాంశాల్లో కూడా వీటి గొప్పతనం గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన చేస్తుంది. భవిష్యత్ వైపు అడుగులు వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలలో ఒకటి హైడ్రా ఏర్పాటు. హైడ్రాను ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లోనే సంచలనం క్రియేట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాలకు ఎందుకు గురవ్వాల్సి  వస్తుందన్నదానిపై సుదీర్ఘంగా ఆలోచనలు చేసి కారణాలను తెలుసుకుంది. ఇందుకు కారణం చెరువుల ఆక్రమణ అని గుర్తించింది. దీనిని కట్టడి చేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది. దానికి విశిష్ట అధికారాలను అప్పజెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడెక్కడా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయో అక్కడ బుల్డోజర్లు, జేసీబీలను రంగంలోకి దించి వాటిని కూల్చివేసి ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది.

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. హైడ్రాను ఏర్పాటు చేసి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు సైతం అభినందిస్తున్నారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కూడా హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదని, హైడ్రాను ఏర్పాటు చేసింది భవిష్యత్తులో నగరం బాగుండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు ఎప్పడు వచ్చినా కూడా నగరంలో వరదలు ముంచెత్తుతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలు సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని, ఈ క్రమంలోనే దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసి, అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

హైడ్రాపై ప్రముఖులు, నిపుణులు, ప్రకృతి ప్రేమికులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అంటున్నారు. హైడ్రాను సక్సెస్ ఫుల్ గా.. ఇంతే జోష్ గా ముందుకు తీసుకువెళ్తే.. కబ్జాదారుల నుంచి నగరంలోని చెరువులు, నాలాలను కాపాడొచ్చని చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఎంత భారీ స్థాయిలో వర్షాలు, వరదలు వచ్చినా నగరానికి ఏమీ కాదని వివరిస్తున్నారు. హైడ్రా ఉంటే హైదరాబాద్ కు అటువంటి బాధే ఉండబోదని పేర్కొంటున్నారు. అందుకే హైడ్రా ఉండాల్సిందేనంటూ నొక్కి మరీ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కూడా హైడ్రాపై చర్చించి విస్తృత అధికారాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే.

Related News

Heavy Rainfall: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

Ponguleti: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Minister Ponnam: ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

BJP Targets Rahul: మోదీజీ మీ స్థాయి ఇది కాదు: భట్టి విక్రమార్క

Big Stories

×