EPAPER
Kirrak Couples Episode 1

The Mystery Of Moksha Island Review: చావును ఎదిరించి మనిషి బతుకుతాడా.. తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

The Mystery Of Moksha Island Review: చావును ఎదిరించి మనిషి బతుకుతాడా.. తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

The Mystery Of Moksha Island Review: ఈ మధ్య కాలంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నాయి.  ముఖ్యంగా మనిషి చావు తరువాత బతకగలడా.. ? మనిషి చనిపోయాక మెదడులోని జ్ఞాపకాలు ఏం అవుతాయి..? ఇలాంటి రీసెర్చ్ కథలు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లను చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందు ఉంటారు. తాజాగా ఇలాంటి కథతోనే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్ వెబ్ సిరీస్ వచ్చింది. నందు, ప్రియా ఆనంద్, అశుతోష్ రాణా, అక్షర గౌడ, సోనియా అగర్వాల్, సుధ, రోషన్ కనకాల, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు  అనీష్ యోహన్ కురువిల్ల దర్శకత్వం వహించగా 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించడం విశేషం. శుక్రవారం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి.


కథ : విశ్వక్ సేన్ ( అశుతోష్ రాణా) ఒక డాక్టర్. మెదడు పై ప్రయోగాలు చేస్తూ.. ఒక కొత్త శక్తిని పుట్టించాలని నిత్యం రీసెర్చ్ చేస్తూ సైంటిస్ట్ గా మారతాడు. అలా ఎన్నో వేల కోట్లు సంపాదిస్తాడు. ఇక తన చివరి రోజుల్లో తనకున్న ఆస్తి మొత్తాన్ని తన వారసులకు ఇవ్వాలని అనుకుంటాడు.  తన రక్త సంబంధీకులందరిని మోక్ష  ఐ ల్యాండ్ కు రమ్మని కబురు పంపుతాడు. వారు రాకముందే ఒక విమాన ప్రమాదంలో అతను చనిపోతాడు. విశ్వక్ సేన్ వారసులు అని చెప్పబడే.. విక్కీ (నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్‌), మున్నా(అజ‌య్ క‌తుర్వార్‌)అదితి (సోనియా అగ‌ర్వాల్‌), మీనా(సుధ), ఇషా(తేజస్వి మదివాడ) తో పాటు వారి పిల్లలు కూడా ఆ ఐస్ ల్యాండ్ కు వస్తారు. అక్కడ విశ్వక్ సేన్ మేనేజర్ మాయ( అక్షర గౌడ) వారి బాగోగులను చూస్తూ ఉంటుంది. విశ్వక్ చనిపోవడంతో ఈ ఆస్తికి వారసుడు కావాలని, ఈ ఆస్తి మీకు దక్కాలంటే ఈ ఐస్ ల్యాండ్ లో వారం రోజులు స్టే చేయాలనీ చెప్తుంది. దీంతో ఆస్తి కోసం వారు అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు. ఇక ఈ వారం రోజుల్లో బంధువుల్లో ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. ఐస్ ల్యాండ్ నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నించినా ఎవరి వలన కాదు. అసలు వారిని చంపుతుంది ఎవరు.. ? చనిపోప్యినా విశ్వక్ సేన్ బతికి ఎలా వచ్చాడు.. ? ప్ర‌యోగాల పేరుతో విశ్వ‌క్‌సేన్ చేసినఎలాంటి దారుణాల‌కు పాల్ప‌డ్డాడు? ఆస్తి కోసం కాకుండా దేనికి వీరందరిని ఒక దగ్గరకు తీసుకొచ్చాడు. చివరికి ఆ ఐస్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చినవారెవరు.. ? అనేది చూడాలంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ: పుట్టినవాడికి మరణం తప్పదు అనేది దేవుడే స్వయంగా చెప్పిన మాట. కానీ, మానవుడు ఆశాజీవి. మరణాన్ని కూడా జయించాలనుకుంటాడు. దానికోసం ఏవేవో కనిపెడుతున్నారు. ఇక ఈ సిరీస్ లో కూడా అదే చూపించారు. మనిషి చనిపోయినా.. అతడి ఆలోచనలు, అతడి జ్ఞాపకాలను వేరొకరి శరీరంలో ప్రవేశపెడితే ఆ మనిషికి మరణమే ఉండదు అనేది విశ్వక్ ఆలోచన అని సిరీస్ లో చూపించారు. అలా  విశ్వక్ అనుకోవడానికి ఒక  కారణం కూడా చూపించారు. ఇలాంటి కథలు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఈ మధ్య రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ లో కూడా ఇదే కథ మెమరీ ట్రాన్స్ ఫర్. అయితే ఈ సినిమాలో రామ్ కు చిప్ ద్వారా మెమరీని ట్రాన్స్ ఫర్ చేస్తే.. ఇందులో మరోలా చూపించారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని తీసుకున్నా.. వాటిని సరిగ్గా చూపించడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు.


ఒక ఐస్ ల్యాండ్.. ఎటు వెళ్లినా ప్రమాదమే అని మొదటి ఎపిసోడ్ లో చూపించారు. కథ  లోపలికి వెళ్లేకొద్దిగా.. అంత థ్రిల్లింగ్ లేకుండా  తేలిపోయేలా చేశాడు. ఎవడు ఎవరిని చంపుతాడో.. ఎందుకు చంపుతాడో చూపించినా.. అసలు ఆలాంటి రీజన్స్ కు చంపడం ఎందుకు అని అనిపించేస్తుంది.మొదట ఒకరు మిస్ అవ్వడం.. తరువాత వారు కాకుండా ఇంకొకరు చనిపోవడం  కొంచెం ఊహించని ట్విస్ట్ లే అయినా.. అలా వెంట వెంటనే  పాత్రలు చనిపోవడం, వాళ్ళు చనిపోయినా.. మిగిలినవాళ్లలో బాధ లేకపోవడం లాంటివి ఫేక్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే..  వారందరూ విశ్వక్ వారసులే అని చూపించడం హైలైట్.. పెళ్లిళ్లు చేసుకోవడం.. పిల్లలను కనడం.. వెళ్లిపోవడం.. వారందరు తన తండ్రి ఎవరు అన్నట్లు పెరగడం లాంటివి అసలు అర్ధం పర్థం లేకుండా, లాజిక్స్ కు దూరంగా ఉంటాయి. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో సగానికి పైగా ఎపిసోడ్స్ ల్యాగ్ చేశారు. దీనివలన అసలు ఎందుకు ఇలాంటి సీన్స్ పెట్టారో అనిపించకమానదు. ఒక 6 ఎపిసోడ్స్ లో కథను లాగించేయొచ్చు. చాలా ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే ఎండ్ చేశారు.

నటీనటులు:  సిరీస్ మొత్తం తెలుగువారికి తెల్సినవాళ్ళే ఉంటారు. అయితే అంతమందిని తీసుకున్నారు అన్నమాటే కానీ, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. సిరీస్ మొత్తంలో నందు, ప్రియా ఆనంద్ కు తప్ప మిగతావన్నీ అంత ప్రాధాన్యత లేని పాత్రలే.. ఉన్నంతసేపు సుధ పాత్ర కొద్దిగా సిరీస్ ను ఎలివేట్ చేస్తోంది. తన భర్త ఎలాంటివాడు.. ఎంత దుర్మార్గుడు అనేది ఆమె భయపడే విధానంలోనే తెలిసిపోతుంది. ఇక ఇవి కాకుండా మాయగా అక్షర నటించిన తీరు ఆకట్టుకుంటుంది. విశ్వక్ సేన్ వద్ద పనిచేస్తూ అతడితో రిలేషన్ లో ఉంటూ.. అతడికోసం ఏదైనా చేయడానికి సిద్దపడే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక వీరితో పాటు సుమ కొడుకు రోషన్ కూడా అద్భుతంగా నటించాడు. తాను ఒక గే అని తండ్రికి చెప్పలేక.. తండ్రి పెట్టిన రూల్స్ ను జవదాటలేక.. మానసిక క్ష్యోభను అనుభవించే టీనేజర్ గా కనిపించి మెప్పించాడు. ఇక తేజస్వి.. ప్రతిసారి బట్టలు  విప్పి చూపించడానికే తప్ప ఆ పాత్ర దేనికి ఉపయోగపడదు. రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌ను క‌థ‌లో కావాల‌నే పెట్టిన‌ట్లుగా అనిపిస్తుంది.మిగతావారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ కూడా ఉందని చెప్పారు. ఓవరాల్ గా చెప్పాలంటే.. వీకెండ్ లో టైమ్ ఉంటే మొత్తం ఎపిసోడ్స్ చూడొచ్చు. లేదు అనుకుంటే.. మొదట ఎపిసోడ్ నుంచి మొదలుపెడితే.. అక్కడక్కడా ఫార్వార్డ్ చేసుకుంటూ 6 ఎపిసోడ్ దగ్గర ఆగితే చాలు.

ట్యాగ్ లైన్:  ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐ ల్యాండ్.. మిస్టరీ తప్ప అన్ని ఉన్నాయి

Related News

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Big Stories

×