EPAPER
Kirrak Couples Episode 1

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Turmeric Benefits: ప్రతి ఒక్కరి వంట గదిలో పసుపు తప్పకుండా ఉంటుంది. ఇంట్లో సులభంగా లభించే పసుపు లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆహారంలో భాగంగా పసుపును తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.


పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది వంటల్లోనే కాదు శుభ కార్యాలలో కూడా అగ్రగామి. పసుపును వంటల్లో ఉపయోగిస్తే వాటికి ఇది మరింత రుచిని అందిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి.

పసుపును హరిద్ర, కుర్కుమా, లాంగ, వరవర్ణిని, గౌరీ, క్రిమిఘ్న, యోషిత్ప్రియ, హత్తవిలాసాని, హర్ దాల్, కుంకుమ్ టర్మరిక్ అనే పేర్లతో వివిధ భాషల్లో పిలుస్తారు. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు ఉండే వివిధ గుణాలు, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. పసుపు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కచ్చితంగా వాతం , కఫాన్ని అణచివేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శరీరంలలోని రక్త ప్రవాహాన్ని ఆపడానికి పసుపును ఉపయోగిస్తారు.

2.పసుపు దంత వ్యాధులు, చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు , కాలేయ రుగ్మతలను తగ్గించడంలో ఉపయోగించబడుతుంది.

3. ఫేషియల్ గ్లో కోసం పసుపు పొడిని పాల మీగడతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మెరుస్తుంది.

4. తేలు, తేనెటీగ, కందిరీగ వంటి విషపూరితమైన కీటకాలు కుట్టినప్పుడు పసుపును కుట్టిన చోట పూయడం ద్వారా మంట తగ్గుతుంది.

5. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఆహారంలో భాగంగా పసుపును తీసుకోవడం వల్ల ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనులలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.

6. రాత్రి పూట నిద్ర పట్టడం కష్టంగా ఉన్నట్లయితే, లేదా మధ్యలో నిద్ర నుంచి మెలుకువ వస్తున్నట్లయితే , నిద్రపోయే ముందు పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది సహజ యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఇది పాలలో ఉన్న కాల్షియంతో కలిస్తే మరింత ప్రభావవంతంగా మారుతుంది.

7. పసుపు ఎలాంటి తలనొప్పి నుంచి అయినా ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతే కాకుండా రక్త ప్రసరణను కూడా నియంత్రిస్తుంది. పసుపు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో సహజంగా ఉండే గుణాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడతాయి. ఇది గ్యాస్ , పొత్తికడుపు వాపును నుంచి కూడా బయటపడేలా చేస్తుంది.

8. పిల్లికూతలు, జలుబు, అలర్జీ, దగ్గు ఉన్నట్లయితే, నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో అర చెంచా పసుపు కలిపి తాగడం మంచిది.

Also Read: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

9 . అన్ని రకాల చర్మవ్యాధులకూ పచ్చి పసుపు, జామకాయ రసాన్ని కలిపి ప్రభావిత ప్రాంతంలో రాస్తే సమస్య దూరం అవుతుంది.

10 . దురద, దద్దుర్లు ఉన్నచోట గంధం, ఆవు మూత్రంలో పసుపు కలిపి రాస్తే ప్రయోజనం ఉంటుంది. దగ్గు , జలుబుతో బాధపడుతున్న వారు అర చెంచా పసుపు పొడిని వేయించి తేనెతో కలిపి తీసుకోవాలి. పసుపు వేయించేటప్పుడు వచ్చే పొగ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

11. పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. నోటిపూత లేదా గొంతు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి పుక్కిలించాలి. గొంతు నొప్పి విషయంలో గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Big Stories

×