EPAPER
Kirrak Couples Episode 1

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Gurbaz Ton, Rashid’s 5 Wickets Seal Afghanistan’s First ODI Series Win Over South Africa: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆఫ్ఘనిస్తాన్ జట్టు గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న టి20 ప్రపంచ కప్ సమయం నుంచి ఇప్పటివరకు… సంచలన విజయాలు నమోదు చేస్తూ ముందుకు వెళ్తోంది ఆఫ్గనిస్తాన్ జట్టు. వాళ్ళ దేశంలో తాలిబన్స్ అరాచకం సృష్టించిన కూడా… ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం మాత్రం సంచలన విజయాలు సాధించడం గమనార్హం. టి20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ వరకు వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు… తాజాగా దక్షిణాఫ్రికా పైన కూడా పై చేయి సాధిస్తుంది.


ప్రస్తుతం… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు విజయం సాధించిన ఆఫ్గనిస్తాన్ జట్టు… 2-0 తేడాతో దక్షిణాఫ్రికా పై వన్ డే సిరీస్ ను సొంతం చేసుకుంది. సార్జా వేదికగా జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో… రికార్డు స్థాయి పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఏకంగా 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ రికార్డు విజయం చేయడం గమనార్హం.

Gurbaz Ton, Rashid’s 5 Wickets Seal Afghanistan’s First ODI Series Win Over South Africa

అంతేకాదు… తొలిసారిగా దక్షిణాఫ్రికాపై…ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఈ రెండో వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది.మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లు ఆడి నాలుగు వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లందరూ రెచ్చిపోయి ఆడడంతో… భారీ స్కోరు నమోదు చేయగలిగింది ఆఫ్గనిస్తాన్.


Also Read: IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో గురుబాజ్ …110 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, మూడు సిక్స్ లు బాదాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. అటు అజ్మతుల్లా… 50 బంతుల్లోనే 86 పరుగులు చేసి రాణించాడు. రహమద్.. 66 బంతుల 50 పరుగులు చేసి అర్థ శతకంతో అందరిని ఆకట్టుకోగలిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి బర్గర్ పీటర్ మర్కరం తలో వికెట్ తీయడం జరిగింది.

Also Read: Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

అయితే అనంతరం చేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా మొదటినుంచి తడబడుతూ స్పష్టంగా కనిపించింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 134 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ తరుణం లోనే 177 పరుగుల తేడాతో… దక్షిణాఫ్రికా జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్.. 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు సాధించిన రషీద్ ఖాన్… భూమిని ముద్దాడుతూ కనిపించాడు. ఇక ఈ సిరీస్ లో… చివరి మ్యాచ్ ఆదివారం రోజున జరగనుంది. ఇందులో కూడా దక్షిణాఫ్రికా జట్టు పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే… మరో సంచలన రికార్డు నమోదు చేయడం గ్యారెంటీ.

Related News

Akash Deep: ఆకాశదీప్ కి బంతి తగిలితే.. అందరూ నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

Big Stories

×