Motorola razr 50 ఫోల్డబుల్ ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో పాటు కళ్లు చెదిరే బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి.

ఈ ఫోన్ మొదటి సేల్ రీసెంట్‌గా ప్రారంభం అయింది. ఈ సేల్‌లో Motorola razr 50 ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

దీని అసలు ధరను రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. 

అయితే ఇప్పుడు ఫస్ట్ సేల్‌లో భాగంగా దాదాపు రూ.5,000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

అంతేకాకుండా కస్టమర్లు ఈ ఫోన్‌ను యాక్సిస్, ఐడిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.10,000 తక్షణ తగ్గింపును పొందుతారు.

ఈ తగ్గింపులతో Motorola razr 50 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు.

దీనిని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. ఇది స్ప్రిట్జ్ ఆరెంజెమ్, బీచ్ సాండ్, కోలా గ్రేలో అందుబాటులోకి వచ్చింది.

ఇది 6.9-అంగుళాల pOLED FHD+ AMOLED మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ టెక్నాలజీ, 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఇది కాకుండా 3.63 అంగుళాల OLED FHD+ AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, HDR10 టెక్నాలజీ, 1700 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఇందులో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4200mAh బ్యాటరీని అందించింది.