EPAPER
Kirrak Couples Episode 1

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Madhavi Latha.. యంగ్ హీరో తనీష్ (Thaneesh) హీరోగా నటించిన నచ్చావులే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మాధవి లత (Madhavi Latha) మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే సినిమాలలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ కూడా అటు సోషల్ మీడియాలో ఇటు సొసైటీ , చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ ఘటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది మాధవి లత.


నాగబాబుకి కూడా కూతురు ఉంది కదా..

మెగా బ్రదర్ నాగబాబు(Nagababu )జానీ మాస్టర్ కి సపోర్ట్ గా పోస్ట్ చేయడంతో తాను బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. మాధవి లత మాట్లాడుతూ.. నాగబాబుకి కూడా ఒక కూతురు ఉంది కదా.. పైగా తన కూతురి కంటే బాధిత అమ్మాయిది చాలా చిన్న వయసు. మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూడా జానీ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ.. ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ముఖ్యంగా ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా.. ఎందుకు ఇంత నిర్లక్ష్యం. నిజానికి మీరు జానీ మాస్టర్ తో పని చేశారు కాబట్టి అతడు మీ వరకు మంచివాడు అయి ఉండవచ్చు. కానీ ఆ అమ్మాయి విషయానికి వచ్చేసరికి అతను మంచి వ్యక్తి కాదు అని స్పష్టమవుతోంది.


Madhavi Latha: Did you forget that Nagababu also has a daughter.. Strong counter on trollers..?
Madhavi Latha: Did you forget that Nagababu also has a daughter.. Strong counter on trollers..?

బహిరంగంగా జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు కూడా…

16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమెపై జానీ మాస్టర్ ప్రేమ మాటలు చెప్పి ఆమెను అత్యాచారానికి గురిచేయడం ఇంతకంటే బాధాకరం మరొకటి ఉండదు. ఆమెది చిన్న వయసు కాబట్టి ఇతడి ప్రేమ మాటలకు ఆమె మోసపోయింది. ఆరు నెలలు మాత్రమే జానీ తో రిలేషన్ లో ఉంది.ఆ తర్వాత అతడి నిజస్వరూపం తెలుసుకొని బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పనిచేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె ఇండిపెండెంట్ గా పనిచేయడం జానీ మాస్టర్ కి ఇష్టం లేదనుకుంటా బహిరంగంగా కూడా ఆమెను చాలా టార్చర్ చేశాడు.. నువ్వు లేకుంటే నేను బతకలేను అంటూ షూటింగ్ ల దగ్గర ఆమెను అవమానపరిచి గొడవ చేసేవాడు. అంతే కాదు ఆమెను ఎన్నోసార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట.

అందుకే అల్లు అర్జున్ సుకుమార్ బాధిత యువతకి సపోర్ట్ చేశారు..

ఇవన్నీ తెలుసుకుని మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ కూడా చేశారు.. నిజానికి టాలెంట్ వేరు క్యారెక్టర్ వేరు కదా.. ముఖ్యంగా పుష్ప 2 సెట్లో గొడవ పడడం వల్లే అల్లు అర్జున్ సుకుమార్ కూడా ఆ అమ్మాయికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు ఎవరు కూడా ఆమెను బలవంతం చేయకూడదు ఇక నాగబాబుకి కూడా కూతురు ఉంది కదా ఈ విషయాన్ని మర్చిపోయారేమో అంటూ అటు నాగబాబుకు ఇటు ట్రోలర్ కి కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది అంతేకాదు ఆమెను హరాస్ చేసిన ఆధారాలన్నీ కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది ఏది ఏమైనా బాధిత యువతకి అండగా నిలుస్తూ ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది మాధవి లత.

Related News

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Big Stories

×