EPAPER
Kirrak Couples Episode 1

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Revanth govt decision: ఎట్టకేలకు హైడ్రాకు మరిన్ని అధికారులను కల్పించింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఆర్డినెన్స్ రానుంది. ఔటర్ రింగురోడ్డు లోపలున్న కోర్ ఏరియాను హైడ్రా పరిధిలోకి తెచ్చింది.


ఓఆర్ఆర్ లోపలున్న 27 మున్సిపాలిటీలు, ఇటీవల గ్రేటర్‌లో చేరిన 51 పంచాయితీ లు దీని పరిధిలోకి వచ్చాయి. శుక్రవారం రేవంత్ కేబినెట్ సమావేశమై హైడ్రాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాకు అధికారులే మాత్రమే కాదు.. సిబ్బందిని కూడా పెంచింది.

సింపుల్‌గా చెప్పాలంటే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రా వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలు రేపోమాపో హైడ్రాకు రానున్నాయి. ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిరక్షణ బాధ్యత ఇకపై హైడ్రాకే.


ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి 169 మంది అధికారులు, 940 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగును డిప్యుటేషన్ పై పంపాలని నిర్ణయించింది. రేవంత్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో కబ్జా రాయుళ్లు బెంబేలెత్తుతున్నారు.

ALSO READ: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

ముఖ్యంగా చెరువులు ఆనుకుని చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసే పనిలో పడ్డారు కొందరు రియల్టర్లు. అంతేకాదు అధికార పార్టీ నేతలతో ఆయా బిల్డర్లు మంతనాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ సౌత్‌ ప్రాంతంలోని ఈ మధ్యకాలంలో అక్రమ కట్టడాలు జోరందుకున్నాయి.

చెరువులను కబ్జా చేసి భారీ ఎత్తున భవనాలు నిర్మించేశారు. సన్‌సిటీ, కాళిమందిర్, హైదర్షాకోట్ ప్రాంతాల్లో భారీగా అపార్టుమెంట్లు వెలిశాయి. చాలా వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. హైడ్రా రంగంలోకి దిగకముందే.. వాటిని తక్కువ ధరకు అమ్మేసే పనిలో పడ్డారు. హైడ్రా దిగితే మొత్తానికి నాశనం అవుతామని భావిస్తున్నారు బిల్డర్లు. ఈ ప్రాంతాల్లో దాదాపు 70 ఎకరాలు కబ్జాకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాలా 1500 కోట్ల రూపాయలపైమాటే.

Related News

Kokapet: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

Muscle Atrophy : నలభై ఏళ్లుగా మంచానికే పరిమితం.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటున్న బాధితుడు

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Big Stories

×