EPAPER

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Sitting Too Much Health Issues Workout| ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు, డిప్రెషన్ కు లోనవడం, మతిమరుపు, ఊబకాయం, పలు రకాల క్యాన్సర్లు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు సుదీర్ఘంగా కదలకుండా కూర్చొని పనిచేయడం కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


అయితే దీనికి పరిష్కారంగా ఆరోగ్య నిపుణులు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అది కూడా సరిపడా సమయం వరకూ చేయాలని చెబుతున్నారు. సుదీర్ఘంగా కూర్చొని పనిచేసేవారు ఎంత సేపు వ్యాయామం చేయాలనే పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్ లో ఆ అధ్యయనం నివేదికను ఇటీవల పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనంలో వేలాది మంది పాల్గొన్నారు. వీరంతా ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు.

Also Read: రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!


వీరంతా ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం లేదా కఠినంగా వ్యాయామం చేస్తే.. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల ఎదుర్కొనే ఆరోగ్య దుష్ప్రభావాలను పరిష్కారం అవుతాయని పరిశోధకులు ఎదుర్కొన్నారు. నిత్యం 10 గంటలపాటు ఆఫీసులో కూర్చొని పనిచేసేవారు 40 నిమిషాలపాటు మధ్యస్తంగా లేదా కఠినంగా వ్యాయామం చేయాలని అలా చేస్తే.. ఆరోగ్యం కుదురుగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

ఎక్కవ సేపు కూర్చొని పనిచేసేవారు తక్కువ వయసులోనే తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా మరణించే ప్రమాదముందని.. అలాంటి వారు తప్పనిసరిగా ప్రతిరోజు 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు ఈ అధ్యయన నివేదికలో తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 గ్లోబల్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఆఫీసులో కూర్చొని పనిచేసే వారు, ఎక్కువ శారీరక శ్రమ పడని వారు ప్రతి వారం కనీసం 150-300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ఇంట్లోనే వీలైనంత సేపు శారీరక శ్రమ కలిగేలా పనులు చేయాలి. ఇంట్లో లేదా ఆఫీసులో లిఫ్ట్ (ఎలివేటర్) లో వెళ్లకుండా వీలైనంత మెట్లు ఎక్కి వెళ్లాలి. ఇంట్లో పిల్లలతో ఆడుకునే సమయంలో కాస్త పరుగులు పెట్టాలి.. లేదా ఇంటిపనుల్లో చురుగ్గా పనిచేయాలి. అప్పుడే శరీరంలో కొవ్వు శాతం తగ్గి, రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది.

Also Read: కిచెన్ లో బల్లి రాకుండా ఈ టిప్స్ పాటించండి..

Related News

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Big Stories

×