EPAPER
Kirrak Couples Episode 1

Arunachalam food: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Arunachalam food: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతుంది అరుణాచల క్షేత్రం. ఇక్కడ ఆ అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఈ అరుణాచల పరమేశ్వరుడిని సాక్ష్యాత్తు జ్యోతిర్లింగ స్వరూపంగా భావిస్తారు భక్తులు. అయితే అరుణచలంలో గిరి ప్రదిక్షణ చేస్తే ఆ ముక్కింటికే ప్రదిక్షణ చేసినట్లుగా అరుణాచల చరిత్ర చెబుతుందంటారు పండితులు. అటువంటి అరుణచల క్షేత్రానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్లాక ఫుడ్‌కు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడ మంచి ఫుడ్‌ దొరుకుతుందో తెలియక దొరికిందే తినేసి ఊసూరుమంటూ వస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే అరుణాచలంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడెక్కడ ఉచితంగా మంచి ఫుడ్‌ దొరుకుందో తెలుసుకుందాం.


తెల్లవారజామున 5 గంటల నుంచి ఐదున్నర లోపు  శేషాద్రి అశ్రమం దగ్గరలో వేడి వేడి ఇడ్లీ సాంబారు, హెర్బల్‌ టీ లభిస్తుంది. ఉదయం ఏడున్నరకు అతిధి ఆశ్రమం ముందు మీనమ్మ  అనే భక్తురాలు వేడి వేడి ఇడ్లీ, చట్నీ సాంబార్ ఇస్తారట. చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు శుద్దమైన గంజి పొస్తారు.

ఉదయం 8 గంటలకు యమలింగం పక్కన ఏదైనా టిఫిన్ పెడతారు. 63 నాయనర్లు గుడి దాటాక  సుకినోభవ ట్రస్టు వారు వేడివేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు. వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు టిఫిన్ పెడతారు. దక్షిణ గోపురం ముందు ఉన్న వినాయక గుడిలో గంజి పొస్తారు.


ఉదయం తొమ్మిది గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు. ఉదయం తొమ్మిదిన్నరకు  రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం, సాంబార్ అన్నము పెడతారు. ఉదయం పదకొండు గంటలకు యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారి ఆశ్రమంలో భోజనం పెడతారు. రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యాగ్ని  ట్రస్టు వారు భోజనం పెడతారు. ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు  యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు (పర్మిషన్ తీసుకున్న వారికి) మాత్రమే భోజనం పెడతారు.

ఉదయం పదకొండున్నర గంటలకు ఆది అన్నామలై గుడిలో భోజనం లభిస్తుంది. నీర్ అన్నామలై గుడి వెనకాల జీవ కారుణ్య, వల్లలార్, ఆశ్రమాలలో మంచి భోజనం లభించును. ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు  సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) వాళ్లు  భోజనం పెడతారు. మెయిన్‌  టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాదు సదం (సత్రం) గ్రిల్స్ ఉంటాయి అందులో సాధువులకు మాత్రమే భోజనం లభించును. ముందే అక్కడికే చేరకుంటే అందరికీ భోజనాలు పెడతారట. అన్నామలై మెయిన్ గుడి దగ్గర భోజనం పెడతారట. ఇక్కడ క్యూ ఎక్కువగా ఉంటుందట కాబట్టి ముందే వెళ్లి వెయిట్‌ చేయాలట. వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు కూడా భోజనం లభిస్తుందట. ఇక శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభిస్తుందట. చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు భోజనం పెడతారు.

మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభిస్తుందట.  పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు ఎడమవైపు కుడివైపు మెయిన్ రోడ్ లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకరు బండి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారట. గిరివలం రహదారిలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఆహార వాహనం బండ్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఆపి ఆహారం తీసుకుని తినవచ్చట.  సౌత్ గోపురం ముందున్న రోడ్ లో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడమ పక్క రహదారిలో కొంచెం ముందుకు వెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాయట అక్కడ ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం పూట భోజనం పెడతారట. గిరి వలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అన్ని ఆశ్రమాలలో అప్పుడప్పుడు (డోనార్స్ ఉన్నప్పుడు) భోజనం పెడుతూనే ఉంటారట.

ఇక సాయంత్రం నాలుగు గంటలకు అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ముందు) వాళ్ళు సాధువులకు టిఫిన్ పాకెట్స్ ఇస్తారట.  సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక చపాతీ కానీ ఇడ్లీ కానీ పాకెట్స్ (పర్మిషన్ తీసుకున్న వాళ్లకు లోపల) ఇస్తారట. సాయంత్రం 5 గంటల నుంచి 63 నాయనర్ ట్రస్ట్ (సద్గురు ట్రస్ట్ ఎదురు, వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వాళ్ళు సాంబార్ రైస్ పెడుతూనే ఉంటారట.

మొదటిసారి అరుణాచలం వెళ్తున్నవారు. ఇంతకముందు వెళ్లి ఫుడ్‌ కోసం ఇబ్బంది పడ్డ వారు ఈసారి అరుణాచం వెళ్లితే పైన వివరాల ప్రకారం మీ ఆకలి తీర్చుకోండి.

Related News

Lucky Zodiac Signs: 2 గ్రహాల ప్రభావం.. వీరికి ధనలాభం

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Negative Energy Signs: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

Shardiya Navratri 2024 : నవరాత్రులులోపు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచకండి

Shani Margi 2024: అక్టోబర్‌లో శని గ్రహం వల్ల 3 రాశుల్లో పెద్ద మార్పు

Toilet Vastu Tips: కొత్త ఇళ్లు కడుతున్నారా.. టాయిలెట్ ఈ దిశలో ఉంటే కెరీర్‌లో పురోగతి ఉండదు..

Big Stories

×