EPAPER

Petrol, diesel prices : తగ్గిన చమురు ధరలు.. పెట్రలో, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. ప్రభుత్వం ఏం చెబుతోందంటే?..

Petrol, diesel prices : తగ్గిన చమురు ధరలు.. పెట్రలో, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. ప్రభుత్వం ఏం చెబుతోందంటే?..

Petrol, diesel prices | అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ తగ్గిపోయాయి. 2023 సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (చమురు) ధర అంతర్జాతీయ మార్కెట్లో సగటున 82-83 డాలర్లు ఉండగా.. గత వారం 70 డాలర్ల దిగువ పడిపోయింది. పైగా భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ ధర తక్కువ ధరకే రష్యా నుంచి చమురు లభిస్తోంది. ఈ పరిణామాలతో సామాన్యుడికి కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం ఊరటనిస్తుందా? పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గిస్తుందా? అనే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం ఓటర్లను ఆకర్షించడానికి పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


దీనిపై పెట్రోలియమ్ మంత్రిత్వశాఖలో పనిచేసే ఒక ఉన్నత ఉద్యోగి స్పందిస్తూ.. ”అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన విషయం వాస్తవమే.. కానీ మళ్లీ పెరిగే అవకాశముంది. గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం మళ్లీ కాస్త పెరిగాయి. అందుకే ప్రభుత్వానికి చవకగా చమురు లభించినా.. ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పట్లో ఏ మార్పు ఉండదు. కానీ మహారాష్ట్ర ఎన్నికలు దృష్ట్యా అక్కడ కూడా బిజేపీ పొత్తు ప్రభుత్వమే ఉండడంతో పెట్రోల్ ధరలు తగ్గినా ఆశ్చర్యం లేదు.” అని చెప్పారు.

Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..


డిసెంబర్ 2021 తరువాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధరలు 70 డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. అయితే గత వారం 70 డాలర్ల దిగువకు పడిపోయిన చమురు ధర.. మళ్లీ గురువారం, సెప్టెంబర్ 19న మళ్లీ 71.71 డాలర్లక పెరిగింది.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉంది. దేశంలో పెట్రోలియం కంపెనీలైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC).. 2021 తరువాత ధరలు పెద్దగా తగ్గించలేదు. కేవలం ఏప్రిల్ 2022లో లీటర్ పెట్రోల్ పై రూ.2 తగ్గించింది. ఆ తరువాత 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది.

అప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, లీటర్ డీజిల్ ధర రూ.87.62 ఉంది.

Also Read: Fixed Deposit Interest Rate| ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

మహారాష్ట్ర ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
గత వారం పెట్రోలియం మంత్రిత్వశాఖ సెక్రటరీ పంకజ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ”ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే దేశంలోని పెట్రోలియం కంపెనీలు ధరల తగ్గించే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాయి. ” అని చెప్పారు.

Related News

Navyug Express Train: కాశ్మీర్ to కన్యాకుమారి- దేశంలో ఎక్కువ రాష్ట్రాలు దాటే రైలు ఇదే, ఎన్ని గంటలు జర్నీ చేస్తుందో తెలుసా?

New Railway Super App: టికెట్ బుకింగ్ నుంచి PNR స్టేటస్‌ చెక్ వరకు.. అన్ని సేవలూ ఓకే చోట, త్వరలో సూపర్ యాప్ లాంచ్ చేయబోతున్న రైల్వే

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఈ వాహనాలు నడపొచ్చు, పోలీసులు పట్టుకోరు, ఫైన్లు ఉండవు తెలుసా!

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

Big Stories

×