EPAPER

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Florida Woman Buried Husband| అమెరికాలో తాజాగా ఒక వింత హత్య కేసు వెలుగుచూసింది. ఒక వ్యక్తి 2015 నుంచి కనబడటం లేదు. దీంతో పోలీసులకు అతని భార్యపై అనుమానం వచ్చింది. పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని పరిష్కారించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి మిస్సింగ్ కేసులో ఆ వ్యక్తి శవం ఇంట్లోనే లభించింది. పోలీసులు హత్య కేసులో అతని భార్యని అరెస్టు చేయగా.. కోర్టులో ఆమె కాదు మరెవరో హత్య చేశారని నిరూపితం అయింది. ఆ హత్య చేసిన వ్యక్తి స్వయంగా కోర్టులో వచ్చి నిజం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో రాష్ట్రాంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడా రాష్ట్రాంలోని లేక్ కౌంటీలో నివసించే మైకెల్ డగ్లస్ షేవర్ అనే వ్యక్తి కనిపించడంలేదని అతని స్నేహితుడు 2018 సంవత్సరంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైకెల్ చివరి సారిగా 2015లో తనతో కలిశాడని ఆ తరువాత నుంచి ఎక్కడున్నాడో తెలియడం లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో లేక్ కౌంటీ పోలీసులలు మైకెల్ మిస్సింగ్ కేసులో విచారణ మొదలుపెట్టారు. ఫ్లోరిడాలోని డిజ్నీ వరల్డ్ లో మైకెల్ మోనోరైల్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేసేవాడని పోలీసులకు తెలిసింది. ముందుగా మైకెల్ ఇంటికి పోలీసులు వెళ్తే.. మైకెల్ భార్య లారీ షేవర్ 2016లోనే మరో యువకుడితో వివాహం చేసుకుందని తెలిసి పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ


2015 నుంచి మైకెల్ కనిపించపోతే.. ఫిర్యాదు ఎందుకు చేయలేదని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానంగా మైకెల్ తన భార్య, పిల్లలను వదిలేసి మరో యువతితో వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు మైకెల్ సోషల్ మీడియా అకౌంట్ ని పరిశీలించారు. విచిత్రంగా మైకెల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. అతని అకౌంట్ నుంచి పోస్ట్ లు కూడా చేస్తున్నాడు. ఇది తెలిసి పోలీసులు.. మైకెల్ ఇంటికి దూరంగా ఎక్కడో ఉన్నాడని భావించారు. కానీ పోలీసులకు మైకెల్ స్నేహితుడు ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తి ఇంతవరకు వీడియో రూపంలో తనతో మాట్లాడలేదని కేవలం మెసేజ్ లు మాత్రమే చేస్తున్నాడని ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశాడు.

దీంతో పోలీసులు మైకెల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న పోస్ట్ లు ఎక్కడి నుంచి చేస్తున్నారో పరిశీలించగా.. మరో ఆశ్చర్యకర విషయం తెలిసింది. మైకెల్ సోషల్ మీడియా అకౌంట్ అతని ఇంటి నుంచే ఆపరేట్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో పోలీసుల మరోసారి మైకెల్ ఇంటికి వెళ్లారు. అక్కడ లారీని ఇంటి లోపల సోదా చేసేందకు అనుమతి అడిగారు. పోలీసులు ఇంట్లో అంతా వెతికినా ఏ ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు స్నిఫర్ డాగ్స్ (పోలీసు కుక్కలు)తో ఇల్లంతా వెతకాలని చూడగా.. విచిత్రంగా లారీ అడ్డుపడింది. అందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకురావాలని చెప్పింది.

దీంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకొని కొన్ని రోజుల తరువాత కుక్కలతో ఇంటిని సోదా చేశారు. అప్పుడు ఆ కుక్కలు ఇంట పెరట్లో ఉన్న ఫైర్ పిట్ (చలికాలంలో వేడికోసం అగ్గిమంటలు కోసం ఉపయోగించే పెద్ద గోళం) కింద ఏదో ఉన్నట్లు పసిగట్టాయి. ఆ ఫైర్ పిట్ కింద అంతా కాంక్రీట్ తో పూడిక చేసినట్లు పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు అనుమానంతో ఆ కాంక్రట్ ని బాగా తవ్వగా మూడు అడుగుల లోతులో ఒక టార్పాల్ లో ఒక కార్పెట్ మ్యాట్ ఉంది. ఆ మ్యాట్ లో మైకెల్ శవాన్ని చుట్టి అక్కడ పాతిపెట్టారు.

Also Read: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

మైకెల్ శవం లభించడంతో పోలీసులు లారీని అరెస్టు చేశారు. ఆమెను విచారణ చేయగా.. మైకెల్ సోషల్ మీడియా అకౌంట్ లో తానే పోస్ట్ లు చేస్తున్నట్లు ఆమె అంగీకరించింది. కానీ మైకెల్ హత్య అనుకోకుండా జరిగిపోయిందని.. మైకెల్ తనపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆత్మరక్షణలో తాను హత్య చేశానని చెప్పింది. దీంతో సెప్టెంబర్ 9, 2024లో మైకెల్ హత్య కేసులో కోర్టులో విచారణ జరుగుతుండగా.. లారీని దోషిగా తేలుస్తూ.. కోర్టు శిక్ష ప్రకటించబోతున్న సమయంలో మైకెల్ అసలు హంతకురాలు అక్కడికి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. మైకెల్ కూతురు.

మైకెల్, లారీ లకు ఇద్దరు సంతానం. అయితే 2015లో మైకెల్ ఒక రోజు తన భార్య లారీని కింద పడేసి కొడుతూ ఉండగా.. మైకెల్ కూతురు (7) వెనుక నుంచి వచ్చి మైకెల్ తల భాగంలో రివాల్వర్ (తుపాకీ)తో కాల్చేసింది. దీంతో లారీ అక్కడికక్కడే మరిణించాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి లారీ.. మైకెల్ శవాన్ని ఇంట్లో పాతిపెట్టింది. అయితే ఇప్పుడు మైకెల్ హత్య కేసులో లారీని దోషిగా కోర్టు నిర్ణయిస్తూ.. శిక్ష వేయబోతే మైకెల్ కూతురు ప్రస్తుతం 15 ఏళ్లు.. కోర్టులో తానే ఈ హత్య చేశానని.. తన తండ్రిని తనే చంపుకున్నానని ఏడుస్తూ చెప్పింది. అయితే ఇదంతా విన్న న్యాయమూర్తి.. లారీ మైకెల్ శవాన్ని దాచిపెట్టినందుకుక ఆమెను దోషిగా తేల్చింది. ఈ కేసులో నవంబర్ 25న తీర్పు వెలువడనుంది.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×