EPAPER

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Pizza Dosa: ఆధునిక కాలంలో పిజా బర్గర్లను తినేవారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలు పిజాని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అది జంక్ ఫుడ్ కోవలోకే వస్తుంది, కాబట్టి పిల్లలకు పెట్టడం అంత ఆరోగ్యకరం కాదు. అందుకే ఇంట్లోనే పిజా దోశను వేసి పెట్టండి. వారు ఇష్టంగా తింటారు. పిజ్జా(Pizza) దోశను చేయడం చాలా సులువు. దోశల పిండి ఉంటే చాలు పిజా దోశను చేసేయొచ్చు.


పిజ్జా దోశకు కావలసిన పదార్థాలు

దోశల పిండి – ఒక కప్పు
క్యాప్సికం తరుగు – రెండు స్పూన్లు
టమోటో తరుగు – ఒక స్పూను
ఉల్లిపాయల ముక్కలు – అయిదు
మిరియాల పొడి – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
చిల్లీ ప్లేక్స్ – అర స్పూను
ఒరెగానో – అర స్పూను
తురిమిన చీజ్ – రెండు స్పూన్లు
బటర్ – ఒక స్పూను
పిజా సాస్ – ఒక స్పూను
స్వీట్ కార్న్ గింజలు – గుప్పెడు


పిజా దోశ రెసిపీ

ఇంట్లో ఉన్న దోశల పిండితోనే పిజా దోశను తయారు చేయవచ్చు. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి దోశల పిండిని కాస్త మందంగా ఊతప్పంలా వేసుకోవాలి. పైన మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసాక దోశపై బటర్ వేసుకోవాలి. అలాగే పిజా సాస్‌ను కూడా వేయాలి. ఆ పిజా సాస్ పై క్యాప్సికం తరుగు, టమోటో తరుగు, ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. స్వీట్ కార్న్ గింజలను కూడా చల్లుకోవాలి. మిరియాల పొడిని చల్లుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లాక్స్, ఒరెగానో కూడా చల్లుకోవాలి. ఆపైన తురిమిన చీజ్‌ను వేసుకొని మళ్ళీ బటర్‌ను చల్లుకోవాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. కాసేపటికి పిజా దోశ రెడీ అయిపోతుంది. ఇది మందంగా వస్తుంది, కాబట్టి పిజా కట్టర్ తో కట్ చేస్తే పిజ్జాలాగే అనిపిస్తుంది.

Also Read: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

పిల్లలకు ఎంతో మేలు

పిల్లలు ఈ పిజా దోశ బాగా ఇష్టంగా తింటారు. అంతే కాదు దీనిలో మనం అనేక రకాల కూరగాయలను వేసాము. కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పిల్లలు పిజా అడిగినప్పుడల్లా ఇలా పిజా దోశ పెట్టి చూడండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది. బయట దొరికే పిజా బేస్‌ను మైదా పిండితో తయారుచేస్తారు. మైదా తయారీలో ఎన్నో హానికారక రసాయనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి మైదాను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరు పూర్తిగా మైదాను పక్కన పెట్టడమే మంచిది. ఇంట్లోనే ఇలా దోశను ఊతప్పంలా వేసి పిజా దోశను తయారు చేస్తే పిల్లలు బయట దొరికే పిజాను మర్చిపోయే అవకాశం ఉంది. మీ ఆ పిల్లల ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వారు కూడా అవుతారు. కేవలం ఇంట్లోని చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ పిజా దోశ ఎంతో నచ్చుతుంది. దీన్ని తినడానికి ప్రత్యేకంగా ఎలాంటి చట్నీ అవసరం లేదు. ఇంకా కావాలంటే టమోటా కెచప్ లో ఉంచుకొని తింటే సరిపోతుంది.

Related News

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Big Stories

×