EPAPER

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

Allu Arjun : కొన్ని సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి సినిమాలలో భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన బొమ్మరిల్లు సినిమా ఒకటి ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సిద్ధార్థ్ జెనీలియా కలిసి నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా థియేటర్లకు తీసుకొచ్చింది. ఒకవైపు యూత్ ని ఆకర్షిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకునే విధంగా సినిమాలు రేర్ గా వస్తాయి అలా రేర్ గా వచ్చిన సినిమాల్లో బొమ్మరిల్లు ఒకటి అని చెప్పాలి.


తన కొడుక్కి అడిగినదానికంటే ఎక్కువ ఇవ్వాలి అని తపించే ఫాదర్. నాకు మా నాన్న అడిగింది ఇస్తే చాలు అని అనుకునే కొడుకు. కొన్ని చిన్న చిన్న విషయాల్లోనే గొప్పగా ఆలోచించే ఒక తండ్రి తన కొడుకు జీవితాంతం ట్రావెల్ చేయబోయే ఒక అమ్మాయి విషయంలో ఎలా ఆలోచించాలి.? తన కొడుకు లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలంటే ఎటువంటి అమ్మాయిని తీసుకురావాలి అని తండ్రి ప్రయత్నాలు, మరోపక్క తనకు నచ్చిన అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని హీరో ప్రయత్నాలు. వీటన్నిటి మధ్యలో లైఫ్ ఇన్ సీరియస్ గా తీసుకోకుండా చాలా క్యాజువల్ గా గడిపేసే ఒక అమ్మాయి. ఈ ముక్కోనపు ప్రేమ కథని బొమ్మరిల్లు భాస్కర్ నడిపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

Bommarillu


ఈ సినిమాలో హాసిని అనే పాత్రలో కనిపించింది జెనీలియా. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదట అర్ధరాత్రి ఐస్క్రీం తినే సీన్ షూట్ చేస్తున్నారు. అప్పుడే హీరోయిన్ జెనీలియా సెట్లోకి అడుగు పెట్టింది. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. అయితే ఆ సీన్ కు సంబంధించి కేవలం రెండు క్లోజ్ షాట్లు తీయడం కోసం తెల్లవారుజాము వరకు షూటింగ్ చేశారు. అయితే ఆ షూటింగ్ కి విసిగిపోయింది జెనీలియా ఏంటి రాత్రంతా కూడా నేను రెండు సీన్లు చేయలేనా అని ఫీల్ అయిపోయి ఇక ఈ సినిమా నేను చేయను అని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో అల్లు అర్జున్ వచ్చి ఇది చాలా మంచి సినిమా మీ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని కన్విన్స్ చేసి ఆ సినిమా చేసేలా చేసాడు.

ఇకపోతే సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు భాస్కర్. అక్కడితో భాస్కర్ లోని టాలెంట్ను చాలామంది గుర్తించారు అందులో అల్లు అర్జున్ ఒకరు. ఆతరణంలోని ఈ కథ అల్లు అర్జున్ కి తెలియటం. అలానే బొమ్మరిల్లు భాస్కర్ యొక్క టాలెంట్ కూడా బన్నీ తెలియడం వలన ఇది ఒక మంచి కథ అని చెప్పి జెనీలియా ను ఈ సినిమా కోసం ఒప్పించారు. మొత్తానికి అల్లు అర్జున్ జెనీలియా చెప్పినట్లు తన కెరియర్లో ఈ సినిమా ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పాలి.

Related News

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Big Stories

×