EPAPER

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Tirumala Laddu Politics: దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. వాద ప్రతివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ దుమారం చెలరేగింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో తీవ్ర దుమారానికి కారణమైంది. తిరుమల పవిత్రతను మీరంటే మీరే దెబ్బతీశారంటూ టీడీపీ, వైసీపీ వాద ప్రతివాదాల మధ్య ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ భక్తుల మనోభావాలతో ఆడుకున్నదెవరు? ఆ దేవదేవుడి ప్రసాదానికే శఠగోపం పెట్టిందెవరు?


గత ఐదేళ్లు తిరుమల కొండపై జరగరానివి జరిగాయన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్న మాట. కొండపై మద్యం, మాంసం, అపరిశుభ్రత, ప్రసాదాల్లో నాణ్యతా లోపం ఇలాంటివెన్నో జరిగాయని చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అందులో జంతు కొవ్వును మిక్స్ చేశారన్నది భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసింది. గత ఐదేళ్లు కళ్లకు అద్దుకుని తిన్న ప్రసాదాన్ని ఇంత దారుణంగా మార్చేశారా అన్నది సంచలనంగా మారింది. తిరుమల అంటేనే పవిత్రత. దాన్ని దెబ్బ తీసేలా వ్యవహారాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి తిరుమల లడ్డూ అంటే భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కొన్ని సార్లు అధిక రద్దీతో స్వామివారి దర్శనం కాకపోతే ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని దీన్నే స్వామి దర్శనంగా భావించే వారూ ఉన్నారు. అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పవిత్రత గత ఐదేళ్లు పూర్తిగా మంట గలిసిందన్న ఆరోపణలతో దేశమంతా తీవ్రస్థాయి దుమారం చెలరేగుతోంది. తిరుమల పవిత్రత గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ప్రస్తుతం కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.


దేవదేవుడికి అపచారం చేసిన వారికి ఈ జన్మలోనే శిక్ష పడుతుందంటారు. ప్రస్తుతం లడ్డూలో జంతువుల కొవ్వు మిక్స్ అయిందన్న ఆరోపణలతో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటికి రావడంతో మరింత దుమారంగా మారింది. భోపాల్ సహా చాలా చోట్ల మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. NDDB CALF ల్యాబ్ రిపోర్టులు కూడా బయటకు రావడంతో అధికారికంగా కల్తీ విషయం కన్ఫామ్ అయింది. అయితే రిపోర్ట్ లో ఫారిన్ ఫ్యాట్ గా కొన్ని పదార్థాల పేర్లు మెన్షన్ చేశారు. అందులో వెజిటేబుల్ ఆయిల్స్ తో పాటు పంది, బీఫ్, ఫిష్ ఆయిల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నిజానికి కూటమి వంద రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి రిపోర్టుల ఆధారంగా సీఎం చంద్రబాబు వారికి కౌంటర్ ఇచ్చారు. ఎవిడెన్స్ కూడా ఉందన్నారు.

కోట్లాది మంది హిందువుల కల ఏంటంటే.. జన్మలో ఒక్కసారైనా తిరుమల వెళ్లి శ్రీనివాసున్ని దర్శించుకోవాలని. అలాంటి పరమ పవిత్రమైన చోటే అపచారాలు జరిగిపోయాయి. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, తిరుమల దేవదేవుడికి అపచారం తలపెడితే.. వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్షిస్తాడని నమ్ముతారు. పవర్ ఫుల్ గాడ్ గా వెంకటేశ్వరుడికి పేరుంది.

Also Read: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

తిరుమల లడ్డూ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ హ‌యాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పని చేసిన వారే ఇప్పుడు జవాబు చెప్పాలంటున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌ప‌డం బాధాక‌ర‌మ‌ని, ఇది అంద‌రి మ‌నోభావాల‌నూ దెబ్బ‌తీసింద‌ని ట్వీట్ చేశారు. బాధ్యుల‌పై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప‌వ‌న్ తెలిపారు. అలాగే దేశంలోని దేవాల‌యాలకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించేలా జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అటు ఏపీ మంత్రి లోకేష్ లడ్డూ తయారు చేసేందుకు వాడిన నెయ్యిలో కల్తీ చేశారని రిపోర్టులు వచ్చాయని, వీటిపై ఏం సమాధానం చెబుతారన్నారు. దేవుడి దగ్గరకూడా రాజకీయాలు చేశారని, అయితే తమ ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఈ ఘటనపై వరుసగా హిందూ సంఘాలు, పూజారులు రియాక్ట్ అవుతున్నారు. మహా అపచారం జరిగిందంటున్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్‌, ఈవో దృష్టికి తీసుకెళ్లానని.. కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వాడడం అపచారమన్నారు. సువాసన లేదు, రుచి లేదన్న విషయం ప్రసాదం తినే వారెవరికైనా తెలుస్తుందన్నారు. ఇన్నాళ్లూ తనది ఒంటరి పోరాటమే అయిందన్నారు.

లడ్డూ తయారీ చేయడానికి ఇచ్చిన టెండర్ ప్రక్రియనే తప్పుడు నిర్ణయమంటున్నారు చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్. వైకుంఠం నుంచి దిగివచ్చిన స్వామి వారికి స్వచ్ఛమైన అవు నెయ్యినే వాడాలని అన్నారు. గోవింద అంటే గోవును రక్షించేవాడు అని అర్ధం కాబట్టి ఆవు నెయ్యినే వాడాలంటున్నారు.

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. నాటి ఈవో ధర్మ రెడ్డిపై గుంటూరులో హైందవ సంఘాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాయి. టీటీడీ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని ఉపయోగించడంపై చర్యలు తీసుకోవాలంటున్నారు. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా ఈ పని జరిగి ఉండదన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అటు కల్తీ నెయ్యి ఘటనపై సీబీఐ విచారణ జరగాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ కాంట్రాక్టర్ కాకుండా కొత్త వ్యక్తి కి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ధర్మారెడ్డి తీరుపై సీపీఐ నేత నారాయణ ఫైర్ అవుతున్నారు. సుప్రీం కోర్టు లడ్డు కల్తీపై విచారణ చేయాలంటున్నారు. సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీ­యంగా లబ్ధి పొందాలని తిరుమలను వాడుకోవడం దారుణమని, ఇది దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.

కాబట్టి  విషయం చాలా దూరం వెళ్తోంది. ప్రపంచమంతా తిరుమల వెంకటేశ్వరుడి భక్తులు ఉన్నారు. లడ్డూకు జీఐ గుర్తింపు కూడా ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

 

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×