EPAPER

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Odisha Army Officer: రౌడీలు తమను వెంబడిస్తున్నారని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళ, ఆమె కాబోయే భర్తపై పోలీసులు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు తమ ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించడంతో తాను వాదించానని ఆ తరువాత తనతోపాటు ఉన్న తన కాబోయ భర్తను కూడా కొట్టి సెల్ లో బంధించి.. తనను మాత్రం వేరే సెల్ లో నగ్నంగా ఉంచారని.. ఆ తరువాత పోలీసులు కాళ్లతో తన్నీ ఒక పురుష పోలీస్ ఆఫీసర్ తన ప్యాంటు ప్రైవేట్ భాగాలను చూపిస్తూ.. అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆ మహిళ ఆరోపణలు చేసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలో రీచా (30, పేరు మార్చబడినది) అనే మహిళ ఒక రెస్టారెంట్ ఓనర్. ఆమెకు భారత సైన్యంలోని 22 సిక్కు రెజిమెంట్ లో కెప్టెన్ గా ఉద్యోగం చేసే యువకుడితో వివాహం నిశ్చయమైంది. రీచాకు సొంతంగా రెస్టారెంట్ ఉండడంతో పాటు ఆమె స్వతహాగా ఒక లాయర్. అయితే సెప్టెంబర్ 15 రాత్రి ఆమె తన రెస్టారెంట్ పనులు ముగించుకొని తన కాబోయే భర్తతో కలిసి ఇంటికి వెళుతుండగా.. కొందరు రౌడీలు వారిని వెంబడించారు. దారిలో ఒకచోట అడ్డుపడి చుట్టుముట్టారు. ఆ రౌడీలు మద్యం సేవించి ఉండడం కారణంగా వారిద్దరూ వారితో కొంచెం ఘర్షణ తరువాత తప్పించుకొని పారిపోయారు.

Also Read: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య


అయినా ఆ రౌడీలు వారిని వెంబడించారు. దీంతో వారిద్దరూ మార్గంలోని భరత్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అప్పటికే రాత్రి ఒంటి గంట సమయం. పోలీస్ స్టేషన్ కేవలం ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఉంది. ఆ మహిళా కానిస్టేబుల్ తో రీచా కంగారు పడుతూ తమను కాపాడమని కొందరు రౌడీలు తమను వెంబడిస్తున్నారని తెలిపింది. కానీ ఆ మహిళా కానిస్టేబుల్ రీచా ఫిర్యాదు నమోదు చేయలేదు.

రీచా చెప్పిన కథనం ప్రకారం.. ”ఆ మహిళా కానిస్టేబుల్ నాతో దురుసుగా ప్రవర్తించింది. ‘అంత రాత్రి సమయంలో మీ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఏదైనా తప్పుడు పనిచేస్తూ ఇక్కడికి వచ్చారా?’ అని ప్రశ్నించింది. దీంతో నేను ఒక లాయర్ అని చెప్పాను. ఇక ఆ తరువాత ఆ మహిళా కానిస్టేబుల్ నాతో వాగ్వాదానికి దిగింది. నేను కూడా తీవ్రంగా ప్రతిఘటించాను. నా ఫిర్యాదు నమోదు చేయాల్సిందే నని పట్టుబట్టాను. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ పెట్రోల్ వాహనం వచ్చి ఆగింది. అందులో నుంచి కొంత మంది పోలీసులు వచ్చారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నేను గట్టిగా మాట్లాడుతుండగా.. వెనుక నుంచి ఆ ఇద్దరు మహిళా పోలీసులు నా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఇదంతా చూసి నా కొబోయే భర్త అడ్డుపడడానికి ప్రయత్నించగా అతడిని కూడా కొట్టి ఒక సెల్ లో బంధించారు. ముందుగానే రౌడీలతో ఘర్షణ కారణంగా అతనికి గాయాలయ్యాయి. అయినా పోలీసులు పట్టించుకోకుండా.. అతడిని కొట్టారు. కిందపడి ఉన్న నేను పైకి లేచి అతడు ఆర్మీ కెప్టెన్ అని చెప్పి.. వారంతా చేస్తున్నదానికి వారిపై కోర్టులో కేసు వేస్తానని బెదిరించాను.

Also Read: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

అది విన్న తరువాత ఆ పోలీసులు ఇంకా కోపంగా నన్ను కొట్టారు. నా జాకెట్ విప్పేసి.. దాంతోనే నా చేతులు కట్టారు. ఒక స్కాఫ్ తో నా కాళ్లు కట్టేసి.. నన్ను నగ్నంగా మరో సెల్ లో పడేశారు. కొంతసేపు తరువాత ఒక పురుష పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను బూతులు తిడుతూ నా ఛాతీ భాగంలో కాళ్లతో తన్నాడు. ఆ తరువాత అక్కడికి స్టేషన్ ఇంచార్జ్ ఆఫీసర్ వచ్చాడు. అతను తన ప్యాంటు విప్పి తనతో శృంగారం చేయాలని చెబుతూ అసభ్యంగా మాట్లాడాడు. నగ్నంగా ఉన్న నన్ను ఇంకా కొట్టి నా ప్రైవేట్ భాగాలు తాకుతూ లైంగిక దాడి చేశాడు.” అని రీచా వివరించింది.

ఈ ఘటన గురించి రీచా కోర్టులో కేసు వేసింది. రీచా పిటీషన్ ని విచారణకు స్వీకరించిన ఒడిశా హై కోర్టు.. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ..సెప్టెంబర్ 26న ఈ కేసు విచారణ వాయిదా వేసింది. అయితే రీచా తనపై పోలీసులు చేసిన దాడి గురించి వివరిస్తూ మీడియాతో మాట్లాడింది. వీడియోలో రీచా మెడ చుట్టూ గాయాలైనట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం రీచా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దేశవ్యాప్తంగా నెటిజెన్లంతా పోలీసుల ఆకృత్యాలపై మండిపడుతున్నారు. రీచా వీడియోని ట్యాగ్ చేస్తూ.. ఒక రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ కెజిఎస్ ఢిల్లోన్ ఒక పోస్ట్ చేశారు. ‘ఇదంతా విని కూడా ప్రభుత్వం మేల్కొనపోతే సిగ్గు పడాల్సిన విషయం. నేను మొదటిసారి జై హింద్ అని రాయడం లేదు’, ఆయన తన పోస్ట్ లో రాశారు.

ఒడిశా ప్రభుత్వం రీచా కేసులో సిఐడి విచారణకు ఆదేశాలు జారీచేసింది. భరత్ పూర్ పోలీస్ స్టేషన్ లోని ఆ రాత్రి డ్యూటీ లో ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ కూడా రీచా కేసుపై స్పందించింది. ఒడిశా డిజీపీ ఈ ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది.

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×